Home » రాజమహల్ రహస్యం బట్టబయలయింది

రాజమహల్ రహస్యం బట్టబయలయింది

– పచ్చటి కొండను గుండు చేశారు
– ఈ భవనాన్ని ఏం చేయాలో చంద్రబాబు తో చర్చిస్తా
– ఋషి కొండ పై నిర్మాణాలు పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు

ఎన్నో ఏళ్ల గా ఉన్న ఋషి కొండ నిర్మాణాల ఉత్కంఠ ఈరోజు తెర లేపడం జరిగింది. ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం అని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయి.

2019 లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వం పై ఎవరు ప్రశ్నించిన అక్రమ కేసులు పెట్టేవారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక విశాఖ లో రాజధాని, అదే విధంగా మూడు రాజధానులు అని యు టర్న్ చేశారు.

పచ్చటి టూరిజం రిసార్ట్ ను అన్యాయంగా కూల్చివేసి, విలాసవంతంగా కట్టడాలను కట్టారు. రుషికొండ నిర్మాణాలు పై ఆధి నుంచి కూడా అన్ని వివాదాలే. పచ్చటి కొండను గుండు చేశారు ఈ జగన్ మోహన్ రెడ్డి. ముందు టూరిజం అన్నారు, కొంతకాలం రిసార్ట్స్ అన్నారు, మరి కొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అన్నారు.

అనుమతులు లేవని ప్రజవేధిక కూల్చారు.ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం కూల్చివేసింది. కేవలం విధ్వంసం సృష్టించాలని ప్రజా వేదికను జే. సీ.బి లతో కూల్చివేశారు.ఋషి కొండ నిర్మాణాలపై కోర్టులు కూడా పలు నివేదికలు ఇచ్చింది.ఈ నిర్మాణం ప్రారంభం కూడా అత్యంత రహస్యంగా ప్రారంభించారు.

ఎంతో ముచ్చట పడి కుట్టుకున్నారు. చివరికి ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మునిపోతున్న పడవ అని గతంలోనే చెప్పాను… ఇప్పుడు అది మునిగిపోయిన పడవ. విశాఖలో రాజధాని వద్దు అని భీమిలి నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించి జగన్ కు బుద్ధి చెప్పారు.

విశాఖ పార్లమెంటరీ లో ఓక్కొక్కరికి సుమారు 50 వేలకు పైగా ప్రజలు కూటమికి ఓటు వేసి గెలిపించారు. మూర్ఖుడు రాజు ఐతే ఇలా ఉంటుందో రాష్ట్రంలో అందరం చూశాం. గతంలో 70 శాతం వరకు పోలవరం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాలలో ఒక్క శాతం కూడా కట్టలేదు. 9.8 ఎకరాలలో నిర్మాణాలు నిర్మించారు.

మొత్తం 7 బ్లాక్ లు… విజయనగర 3 బ్లాక్, కళింగ, గజపతి, వెంగి లో రెండు బ్లాక్ లు ఉన్నాయి. గతంలో ఉన్న రిసార్ట్ ను తొలగించి, గ్రావెల్ ఇలా అన్నిటికీ కూడా వైసీపీ ప్రభుత్వం 95 కోట్లు ఖర్చు తరలించారు. చంద్రబాబు, పవన్ ను కూడా ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు. నిర్మాణాలపై కోర్టులు కూడా కమిటీ ఏర్పాటు చేస్తే… ఆ కమిటీలు కూడా ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అంటూ నివేదిక ఇచ్చింది.

500 కోట్లు పెట్టి ఈ నిర్మాణాలు నిర్మించారు. ఈ భవనాన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో చర్చిస్తా. త్వరలోనే విశాఖ కు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుంది. రాజమహల్ రహస్యం ఈరోజు బట్టబయలు అయింది.

జనసేన భీమిలి ఇన్చార్జి సందీప్ పంచకర్ల
బాహుబలి స్టోరి అందరు మర్చిపోయారు కానీ రుషికొండ లో ఏం జరుగుతుందో అని ప్రజలు మర్చిపోలేదు. గతంలో ఇక్కడికి వస్తే ఎన్నో అరెస్ట్ లు చేశారు.అక్రమ కేసులు పెట్టీ మమ్మల్ని ఈడ్చుకు వెళ్లిన రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎర్ర మట్టి దిబ్బలు పర్యటన కు వస్తె ఇక్కడికి రాకుండా ఆపేశారు. ఈరోజు గంటా శ్రీనివాసరావు సమక్షంలో లోపలికి రావడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 30 అడుగులు బారికేడ్లను పెట్టి లోపల అసలు ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా చేశారు.

Leave a Reply