-అస్వస్థతకు గురైన వాళ్లకు మెరుగైన చికిత్స
-అందరికీ పరీక్షలు… పాజిటివ్ ఉన్న వాళ్లకు ఐసోలేషన్
-రెసిడెన్షియల్ స్కూల్/కాలేజీలో రొటీన్ పరీక్షల్లో బయటపడ్డ కరోనా
-9 మందికి పాజిటివ్.. ప్రస్తుతం క్వారంటైన్ కు తరలింపు
-తొర్రూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో కరోనా కలకలం పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్
కరోనా తీవ్రత చాలా తక్కువ… భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండాలి. తగిన చికిత్స అందుబాటులోనే ఉంది. కరోనా కూడా అదుపులో ఉంది. ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. బూస్టర్ డోస్ కూడా ఇస్తున్నది. కొద్దిపాటి అప్రమత్తత అవసరం. పాజిటివ్ వస్తే, జాగ్రత్త అవసరం అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో కరోనా కలకలం పై జిల్లా కలెక్టర్, RDO, జిల్లా వైద్యాధికారి, సంబంధిత స్కూల్, కాలేజి ప్రిన్సిపాల్, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, వైద్యాధికారులు తదితరులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ గురుకుల పాఠశాల కాలేజీలలో అస్వస్థతకు గురైన పిల్లలను శిక్రంలో ఉంచుతారని వాళ్ళందరికీ రెగ్యులర్గా రొటీన్ టెస్టులు జరుపుతారని ఇందులో భాగంగా తొర్రూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో మంగళవారం రాపిడ్ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 9 మందికి కరుణ పాజిటివ్ గా తేలిందని మంత్రి వివరించారు.
అస్వస్థతకు గురైన వాళ్లకు మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. అందరికి పరీక్షలు…నిర్వహిస్తున్నాం. పాజిటివ్ ఉన్న వాళ్లకు ఐసోలేషన్ కు పంపించాం. వళ్ళంతా వాళ్ల తల్లిదండ్రులతో వారి వారి ఇండ్లకు వెళ్లారు ఐసోలేషన్లో ఉన్నారు. మిగతా పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించాం వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అని మంత్రి తెలిపారు. కరుణ విస్తరణ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.