Suryaa.co.in

Andhra Pradesh

సింగపూర్ టీడీపీ ఆధ్వర్యంలో “తెలుగుదేశం గెలుస్తోంది రా” పాట విడుదల

• కార్యక్రమానికి వర్చువల్ గా హాజరైన అరిమిల్లి రాధాకృష్ణ, వేమూరి రవి,డాక్టర్ కంచర్ల శ్రీకాంత్
• కార్యక్రమానికి సింగపూర్ టీడీపీ 200మంది సభ్యులు హాజరు

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు తమవంతు మద్దతుగా తెలుగుదేశం సింగపూర్ వారు రూపొందించిన “తెలుగుదేశం గెలుస్తోంది రా” పాటను తణుకు మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ, NRI TDP వేమూరి రవి కుమార్ , ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్ది డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా వర్చువల్ గా పాల్గొని విడుదల చేశారు. ఈ సంధర్భంగా రాధాకృష్ణ ప్రసంగిస్తూ రాష్ట్రంలో అరాచక పాలన పోయి మళ్లీ చంద్రబాబు పాలన రావాలని, అందుకోసం ఎన్.ఆర్. ఐలు తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఎన్. ఆర్. ఐ టీడీపీ వేమూరి రవి మాట్లాడుతూ తెలుగుదేశం గెలుపు కోసం ప్రవాస భారతీయులు పోషించాల్సిన పాత్ర వివరించారు. డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ మార్చి 13న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు తమకు తెలిసిన వారితో ఓట్లు వేయించి టీడీపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.

“తెలుగుదేశం గెలుస్తోంది రా” పాటకు పని చేసిన సాంకేతిక బృందం సభ్యులు వంశీ, చందు విజువల్స్ వివరాలు తెలియచేశారు. సింగపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 200మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. “తెలుగుదేశం గెలుస్తోంది రా” పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు టీడీపీ సింగపూర్ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A RESPONSE