Suryaa.co.in

Andhra Pradesh

ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా రాష్ట్రానికి పట్టిన వైసీపీ ప్రభుత్వ శని వదులుతుంది

– డెయిరీ లు తెరిపిస్తాము అని నాడు చెప్పి….రాష్ట్ర ప్రజల ఆస్తులు జగన్ అమూల్ కు కట్టబెట్టారు
– అధికారం లోకి వచ్చాక నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం
– బాంబులకే భయపడని కుటుంబం మాది….యువగళంపై కోడిగుడ్లకు భయపడతామా?
చేరికల సభలో చంద్రబాబు నాయుడు
-పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరిన 1000 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు
-ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీలో చేరికలు

నేడు పార్టీలో చేరిన పాణ్యం సావిత్రమ్మ, పాణ్యం సుబ్బారాయుడు, వారి మద్దతు దారులు, అనుచరులకు స్వాగతం.జగన్ పాలనలో ప్రజలు నాలుగేళ్ల నరకాన్ని అనుభవిస్తున్నారు. సొంత బాబాయిని చంపిన వ్యక్తి జగన్. అలాంటి జగనుకు ఎవ్వరూ ఓటేయరు. జగనుకు పులివెందుల్లో ఓటమి ఖాయం.

ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరు బకాసురుడు. ఎమ్మెల్యే చేసిన తప్పులను ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను చంపేశాడు.మట్కా నిర్వహణ.. గుట్కాల అమ్మకం.. తోపుడు బళ్ల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేయడం ఎమ్మెల్యే రాచమల్లుకు అలవాటు.జగన్ పాలనలో ప్రజలపై బాదుడు. 4 ఏళ్లలో 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచి రూ. 51 వేల కోట్ల మేర విద్యుత్ భారం మోపారు.

టీడీపీ ప్రభుత్వం రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం.నేడు టమాటా కేజీ రూ. 200కు చేరింది. నిత్యావసర ధరలు పెరిగాయి.టీడీపీ హయాంలో ధరలు పెరిగితే నియంత్రించాం. ఉల్లిపాయ ధరలు పెరిగితే నాసిక్ నుంచి ఉల్లిపాయలు తెప్పించి ధరలను కంట్రోల్ చేశాను. చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగనే. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు ఇస్తాం

తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం.ముగ్గురు పిల్లలుంటే రూ. 45 వేలు.. నలుగురు పిల్లలుంటే రూ. 60 వేలు ఇస్తాం.ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. ఫిష్ మార్కెట్ పెట్టి ఉద్యోగాలు తెచ్చాననే సీఎం జగనే. మన అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. పరిశ్రమలు.. పెట్టుబడులు తెస్తాం.

యువతకు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం.రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. అన్నదాత పథకం కింద ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం.. మంచినీటి సౌకర్యం కల్పిస్తాం. బీసీల కోసం రక్షణ చట్టం తెస్తాం. ఉచిత ప్రయాణం ద్వారా ప్రతి ఆడబిడ్డ కు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.

ఈ ముఖ్యమంత్రి నాలుగేళ్లలో ముస్లింలకు ఒక్క మేలు చేశాడా? కడపలో హజ్ హౌస్ నేనే కట్టాను. జగన్ రెడ్డి నాలుగేళ్లలో నువ్వేం చేశావో చెప్పగలవా? టిడిపి హయంలో రంజాన్ తోఫా ఇచ్చాం. విదేశీ విద్యలో అవకాశం కల్పించాం. మసీదులకు ఆర్థిక సాయం అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బక్రీద్ రోజున మాచర్లలో అన్వర్ ని అరెస్టు చేయటం దుర్మార్గం. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ వైసీపీ నాయకులే.

పొద్దుటూరులో మూతపడ్డ డెయిరీని జగన్ తెరిపించలేదు…కానీ చిత్తూరు డెయిరీని అమూల్ కు అప్పగించేశాడు.చిత్తూరు డైరీ ఓపెన్ చేయలేడు…. ఈ రాష్ట్రాన్ని అమూల్ బేబీకి తాకట్టు పెడతాను అంటాడు.రూ.6 వేల కోట్ల ఆస్తులు అమూల్ కు రాసి ఇచ్చాడు. ఎవడబ్బ సొమ్మని ప్రజల ఆస్తి రాసి ఇచ్చారు.

కర్ణాటక లో అమూల్ ను తిరస్కరించారు. తమిళనాడు వాళ్లు వద్దు అన్నారు. కానీ జగన్ అమూల్ ను రాష్ట్రానికి తెచ్చాడు.చిత్తూరు డెయిరీ, ఒంగోలు డెయిరీ ఆస్తులను అమూల్ కు రాసి ఇచ్చాడు. 72 శాతం పూర్తి చేసిన పోలవరాన్ని జగన్ నాశనం చేశాడు. పోలవరం పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది.గోదావరి పెన్నా అనుసంధానం జరిగితే రాష్ట్రంలో నీటి కొరతే ఉండేది కాదు.

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాలకుడు ఈ జగన్ రెడ్డి. జగన్ పాలనలో అమర్ రాజా, లులు వంటి కంపెనీలు వెళ్లిపోయాయి. పెట్టుబడులు తరలిపోయాయి. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా…మూడు సార్లు సిఎంగా పనిచేశా. తెలుగు వారిని ఉన్నత స్థితిలో చూడడమే నా లక్ష్యం.బాంబులకే భయపడని కుటుంబం. మాది…యువగళంలో లోకేష్ పై కోడిగుడ్లు వేస్తే భయపడతామా?

ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డి చెయ్యని తప్పుకు 29 రోజులు జైలు శిక్ష అనుభవించాడు ఏం తప్పు చేశాడని అతన్ని జైల్లో పెట్టారు.ఆడబిడ్డలకి రాష్ట్రంలో రక్షణ లేదు. రేపల్లె లో జరిగిన అమర్నాథ్ ఘటన కలిచివేసింది. అక్కని కాపాడుకొవటానికి వెళ్లిన తమ్ముడుని అతి కిరాతకంగా చంపేశారు. తాడిపత్రిలో సిఐ ఆనందరావు ఎమ్మెల్యే ఆరాచకం వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

రాష్ట్రంలో సీఎం గ్రాఫ్ వేగంగా పడిపోతుంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఇంటికి పోవడం ఖాయం.నిన్నా మొన్నా జగన్ ఢిల్లీకి వెళ్లాడు.. ఏ సాధించాడు..? హోదా? తెచ్చాడా…పోలవరం నిథులు తెచ్చాడా…విభజన హామీలు సాధించాడా ముందస్తు ఎన్నికలంటూ వాళ్లే లీకులిస్తారు.. వాళ్లే ఖండిస్తారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్దం. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే.. జగన్ అంత త్వరగా ఇంటికి పోతాడు. అంత త్వరగా ప్రభుత్వ శని వదులుతుంది.

ఈ చేరికల కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, పార్టీ నేతలు మౌలానా ముస్తాక్ అహ్మద్,నాగుల్ మీరా, సయ్యద్ రఫీ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE