Suryaa.co.in

Telangana

తెలంగాణ ఆత్మ ఢిల్లీకి తాకట్టు

– రాజీవ్ గాంధీకి, తెలంగాణకు ఏం సంబంధం?
– తెలంగాణ తల్లి విగ్రహస్థానంలో రాజీవ్ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా గోపాల్ పేటలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట: తెలంగాణ ప్రజల పోరాటం,త్యాగాల ఫలితమే నిజాం ప్రభుత్వం భారత యూనియన్ నందు విలీనం. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినంగా జరుపుకోవాలి. తెలంగాణ ఆత్మగౌరవం అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాదే.

తెలంగాణ ఆత్మ డిల్లీకి తాకట్టు. రాజీవ్ గాంధీకి, తెలంగాణకు ఏం సంబంధం? రాజీవ్ గాంధీ బ్రతికి ఉన్నా ఈ దుర్మార్గాన్ని సహించేవారు కాదేమో. నిజాం ప్రభుత్వం భారత యూనియన్ నందు విలీనము తర్వాత స్వయం ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రాన్ని నెహ్రూ ప్రభుత్వం కుట్రతో ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాలను కలిపి సమైక్య రాష్ట్రం చేయడంతో ఆనాటి నుండి స్వరాష్ట్ర కాంక్ష కొరకు ప్రజలు ఉద్యమించి 1969 ప్రారంభమైన ఉద్యమం 1972వరకు పోరాటం చేసి 369 మంది అమరులైనారు.

30 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్న తరుణంలో కె.సి.ఆర్ నాయకత్వములో ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఉద్యమం ప్రభంజనమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.10 ఏండ్లుగా కె.సి.ఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు,అమలు కాని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విధ్వంసం చేశారు అని ఆరోపించారు.

LEAVE A RESPONSE