– సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళం అందించిన అంకబాబు
విజయవాడ: ఈ సందర్భంగా అంకబాబు ఏమన్నారంటే.. సామాజిక బాధ్యతగా సీఎం సహాయ నిధికి విరాళం అందించాను. ఇది ఓ జర్నలిస్టుగా నా బాధ్యత. విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదు. విపత్తు సమయంలో ఏడుపదుల వయస్సులో, ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చొరవ,సమయస్ఫూర్తి అద్భుతం.
కలెక్టరేట్ లో 9 రోజులపాటు బస్సులోనే ఉంటూ, అధికారులను చంద్రబాబు పరుగులు పెట్టించారు. వరదల్లో చిక్కుకుపోయిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపన్నహస్తం అందించారు. వరద బాధితులకు ఆహారం,నీరు,పాలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం,పాలన దక్షత వరద బాధితులను విపత్తు నుండి గట్టెక్కించింది.
నేను 40 ఏళ్లుగా విజయవాడలో జర్నలిస్టుగా పని చేశాను.
ఎపుడు ఇలాంటి విపత్తు చూడలేదు. దేశంలో ఏ నాయకుడు బాబు మాదిరిగా విపత్తుల సమయం లో ఇలా స్పందించిన దాఖలాలు లేవు. విపత్తు చూసి నేను చలించిపోయాను. నా కుమార్తె లక్ష్మి, కుమారుడు రంజిత్ లు అమెరికా లో ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ల ప్రోత్సాహంతోనే ఐదు లక్షల విరాళం ఇచ్చాను. నిజం నిర్భయంగా చెప్పగలిగినవాడే నిజమైన జర్నలిస్టు.