Suryaa.co.in

Andhra Pradesh

కులాల మధ్య చిచ్చుపెట్టె చర్యలు మంచిది కాదు

– చిత్తూరు జిల్లా రామకుప్పంలో విగ్రహ వివాదంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు

రామకుప్పం లో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా జరిగిన ఘటనను ఖండిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత విగ్రహం పక్కనే… వివాదం సృష్టించేలా మరో విగ్రహం పెడతాం అనడం సరికాదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం కోసం ఓ వర్గం ర్యాలీ చేసి ఉద్రిక్తత లు సృష్టించారు. అంబేద్కర్ విగ్రహం ఉన్న దగ్గరే…పంతం కోసం ఉయ్యాలవాడ విగ్రహం పెడతామన్న ఆలోచనను విరమించుకోవాలి.

దళిత సంఘాలు రోడ్డెక్కే వరకు అధికారులు ఏమి చేస్తున్నారు?. ఇప్పటికే ఈ అంశం పై ఉన్న ఫిర్యాదును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? కులాల మధ్య చిచ్చు పెట్టె చర్యలు మంచిది కాదు. దళిత సంఘాల ఆందోళనను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం మరో చోట ఏర్పాటు చేసుకోవాలి.

అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా కులాల కుంపటి రాజేసే సంస్కృతికి ప్రభుత్వ పెద్దలు వైఖరే కారణం. ఓ వర్గం ఆధిపత్యం కోసం దళితుల మనోభావాలు దెబ్బతీయడం సరి కాదు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గం లో ఉద్రిక్తతలు నివారించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE