అనేది 1945లో జపాన్‌లోని నాగసాకిలో ఆగస్ట్ 9న ఆ నగరంపై అణుబాంబు దాడి జరిగిన కొద్దిసేపటికే తీసిన చారిత్రాత్మక ఛాయాచిత్రం….
ఆ ఛాయాచిత్రంలో సుమారు 10 ఏళ్ల బాలుడు చనిపోయిన తన తమ్ముడిని తన వీపు మీద పట్టీతో కట్టి మోస్తున్నాడు.
శ్మశానవాటిక వద్ద తమ్ముడికి దహన సంస్కారం చేయడానికి తన వంతు కోసం వేచి ఉన్నాడు.
ఒక సైనికుడు ఆ బాలుడ్ని గమనించి, “నువ్ అలసిపోతావ్ చనిపోయిన పిల్లవాడిని ఎంత సేపు మొస్తావ్ కింద ఉంచమని” అడిగాడు.
“అతను బరువుగా లేడు, అతను నా సోదరుడు!”
అని బదులు చెప్పాడు ఆ బాలుడు.
ఆ పిల్లాడు చెప్పింది విని ఆ సైనికుడు అవాక్కయ్యాడు: సైనికుడి కళ్ళు చెమర్చాయి.
అప్పటి నుండి, ఈ చిత్రం జపాన్‌లో “ఐక్యత”కు చిహ్నంగా మారింది.
“అతను భారంగా లేడు. అతను నా సోదరుడు. ఆమె నా సోదరి.” దీన్ని మన నినాదంగా ఉండనివ్వండి.
అతను పడిపోతే, అతన్ని లేపండి. మీరు అలసిపోయినప్పటికీ, అతనికి సహాయం చేయండి.
సోదరుడు, సోదరి దగ్గరి వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉంటే మద్దతు ఇవ్వండి. తప్పు చేస్తే, క్షమించండి.
మన వాళ్ళు మనకు ఎప్పుడు భారంగా ఉండరు ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు.
.. వాళ్ళను ప్రపంచం విడిచిపెడితే, మీ వీపుపై మోయండి.
– మధుసూదన్‌రాజు వేగేశ్న