Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది

ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య 

జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో జీ.వి.జే బాయ్స్ హై స్కూల్ నందు ఈరోజు ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి పాఠశాలల అండర్ 14 /అండర్ 17 బాలికలు, బాలుర కబడ్డీ పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు.విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని పాఠశాల స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. క్రీడలు శారీరకంగానే కాకుండా ఏకాగ్రతను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, కౌన్సిలర్లు కంచేటి గీతారాణి, పేరం సైదేశ్వర రావు నాయకులు పితాని శ్రీనాథ్, చిట్టూరి రమేష్, చెన్న బాలకృష్ణ, కట్ట నవీన్ మరియు వివిధ పాఠశాలల క్రీడా ఉపాధ్యాయులు మరియు స్కూలు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE