ఢిల్లీ ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం..
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు ఏపీ భవన్ విభజనకు మోక్షం లభించింది. ఈ మేరకు విభజన చేస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి కేంద్ర హోంశాఖ ఆమోద ముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
దీని ప్రకారం తెలంగాణకు 8.254 ఎకరాలు రానుంది. ఇందులో శబరి బ్లాక్‌లో మూడు ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు రానుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు 11.536 ఎకరాలు వస్తుంది. 5.781 ఎకరాల్లో ఉన్న స్వర్ణముఖి బ్లాక్, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.259 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు ఏపీకి వస్తుంది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి.