Suryaa.co.in

Political News

బస్సు.. ఇద్దరు డ్రైవర్ల కథ

హైవే మీద ఒక బస్సు పోతోంది… డ్రైవర్ బాగానే డ్రైవ్ చేస్తున్నాడు… అతనికన్నా ఇంకా బాగా డ్రైవ్ చేస్తాను ఒక్క అవకాశం ఇవ్వండి అని ఒకడు అడిగితే.. బస్సులో ఉన్న మెజారిటీ ప్రయాణికులు అతనికొక ఛాన్స్ ఇచ్చారు.

ప్రయాణం మొదలయ్యింది.. కొత్త డ్రైవర్ రోడ్ మీద పోకుండా , డైరెక్ట్ గా బస్సుని పొలాలలోకి దించాడు.. ప్రయాణికులు బస్సులో ఎగిరెగిరి పడుతున్నారు.. ఏమి జరుగుతుందో అర్ధం కావట్లేదు. ప్రయాణికులు ఏంటి బాబు ఎక్కడికి తీసుకుపోతున్నావు.. ఏంటి ఈ డ్రైవింగ్ అని గొడవ చెయ్యటం మొదలెట్టారు.. కొంతమంది బూతులు తిట్టటం మొదలెట్టారు. పాత డ్రైవర్ బ్రహ్మాండంగా చేసేవాడు..అతన్ని మార్చి తప్పు చేసాము అని ఇంకొంతమంది ఏడుపు..

ఇప్పుడేగా డ్రైవింగ్ మొదలెట్టింది అప్పుడే గోల ఏంటి అని, డ్రైవర్ మనుషులను ఎదురు ప్రశ్నించటం మొదలెట్టారు. బూతులు తిడితే ఊరుకోము కొట్టి బొక్కలో వేస్తాం అని కొంతమందిని కొట్టటం మొదలెట్టారు.
నేను ఏ రూట్లో పోతే అదే రహదారి అని, డ్రైవర్ పంచ్ డైలాగులు వేసుకుంటూ.. నేను ఎవరి మాటా వినను అని తన దారిలో తను పోతున్నాడు. బస్సు స్లో అయ్యిపోయింది.. ఏ బురదలో చిక్కుకుని ఆగిపోతుందో మరి.

పాత డ్రైవర్ ఎంత గొప్ప డ్రైవరో ఇప్పుడు అర్ధమయ్యింది ప్రయాణీకులకు. డ్రైవర్ ని మళ్లీ మార్చేయ్యొచ్చు కానీ.. ఆలోపు కొత్త డ్రైవర్ బస్సుని ఏ బురదగుంటలోనో తీసుకుపోయి దిగబెడితే .. అతనైనా బయటకి తీసుకురాగలడా.. అనే ఆలోచన ప్రయాణికులలో మొదలయ్యింది.

– వెంకటేశ్వర్లు కిలారు

LEAVE A RESPONSE