ఎపి హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

అమరావతి,8 డిసెంబరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ డా.కె.మన్మధరావు,జస్టిస్ కుమారి బొడ్డుపల్లి భానుమతిలచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు.బుధవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇద్దరు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు.