ముఖ్తార్ అన్సారీ ని ఏప్రిల్ 8 వ తేదీన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అప్పజెబుతామని పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ కు లిఖిత పూర్వకంగా తెలియజేసింది.ముఖ్తార్ కి యోగి జీని తలుచుకుంటే పంచె తడి అయిపోతోంది. దీని వెనుక పెద్ద కథే ఉంది.
అది 2005 వ సంవత్సరం. గోరఖ్పూర్ కి 64 కిమీ దూరంలో ఉన్న మఊ అనే ఊరిలో ఈ ముఖ్తార్ దగ్గర ఉండి మరీ శాంతికాముకుల సమూహంతో హిందువులను ఊచకోత కోయిస్తున్నాడు. ఓపెన్ జీప్ లో ఆయుధాలు పట్టుకొని ఊరంతా తిరుగుతూ హిందువులపై దాడులు చేయిస్తున్నాడు. 3 రోజులపాటు అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. తగ్గుముఖం పట్టడం లేదు. అందులో అప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్. ప్రభుత్వం కానీ, పోలీసులు గానీ అసలు ఏమీ జరగనట్లే మౌనంగా ఉన్నారు.
గోరఖ్పూర్ లో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ఇక భరించలేక పోయాడు. అప్పటికే ఆయన గోరఖ్పూర్ నుండి బీజేపీకి 2వ సారి MP గా ఉన్నారు. ఢిల్లీలో ని బీజేపీ నేతలైన వాజపేయి, అద్వానీ, రాజనాథ్ సింగ్, మురళీ మనోహర్ జోషీ లతో ఫోన్లో మాట్లాడారు. మాట్లాడటమే కాదు, నిర్మొహమాటంగా ఒక విషయం తేల్చి చెప్పారు.
“నేను రేపు మఊ వెళుతున్నాను, మన పార్టీ కార్యకర్తలను నాతో పంపించండి. ఎవరూ రాకపోయినా, నేను మఊ వెళ్ళటం ఖాయం, కానీ మీరంతా మౌనంగా చూస్తూ ఊరుకుంటే నేను పార్టీకి రాజీనామా చేసేస్తా. తర్వాత మీ ఇష్టం”.
ఢిల్లీలో ని వాతావరణం వేడెక్కింది. 1992 లో అయోధ్య లోని కరసేవకులపై ములాయం సింగ్ ఎలా కాల్పులు జరిపించాడో వారు మరచిపోలేదు. పార్టీ కార్యకర్త లను పంపితే మళ్లీ ములాయం కాల్పులు జరిపిస్తే ఏంటి పరిస్థితి? ఆలోచించారు. కార్యకర్త లను పంపడానికి సిద్ధ పడకుండా యోగీజీనే ఆ ప్రయత్నం మానుకోమని సలహా ఈయసాగారు. యోగీజీ మర్నాడు ఒక 3 వాహనాలలో ఆయన స్థాపించిన హిందూ యువావాహిని తో బయలుదేరారు. అప్పటికే ముఖ్తార్ 2-3 సార్లు యోగీజీ పై హత్యాయత్నం కూడా చేసాడు. అది తలుచుకుంటేనే భయ మేసిన కార్యకర్తలు.. అధిష్టానం సలహాను పెడచెవిన పెట్టి యోగీజీ కార్లతో తమ కార్లనూ కలిపారు. చివరికి మఊ చేరుకునేటప్పటికి 140-160 వాహనాలు convoy లా రయ్ రయ్ మంటూ దూసుకుపోసాగాయి.
మీకు తెలియనిదేముంది? శాంతికాముకుల ఆయుధాలు అప్పుడూ ఇప్పుడూ ఒకటే, రాళ్ళు – పెట్రోల్ బాంబులు. చివరి 8 వాహనాలపై పెట్రో బాంబులు విసిరారు. వాహనాల లోని మనవారు వాహనాలు దిగి మరీ వారిని పట్టుకోబోతే , ఆ పిరికిపందలు పారిపోయారు.
అందరినీ అరెస్టు చేయమని ములాయం ఆదేశాలిచ్చాడు. కానీ పోలీసులు 140-160 వాహనాల లోని వారిని చూసి అరెస్టు చేసే ధైర్యం చేయలేకపోయారు. ఇంతమంది హిందువులను చూసాక, దెబ్బకు అల్లర్లు ఆగిపోయాయి. ఎలాగో తెలుసా? పోలీసులు ములాయం తో ఇలా అన్నారు – ” సార్! ఇక్కడి జనాలు మమ్మల్ని చంపే లా ఉన్నారు, అరెస్టు అన్నామంటే ముఖ్తార్ ని చంపిగానీ వెనక్కువెళ్ళరు “.
తర్వాత యోగీజీ బీజేపీకి తన రాజీనామా ని పంపించారు. అధిష్టానం వద్దని వేడుకున్నా యోగీజీ వినలేదు. రాజనాథ్ సింగ్ తాను గోరఖ్పూర్ వస్తానన్నా యోగీజీ రావద్దని చెప్పారు. చివరికి అద్వానీ గోరఖ్పూర్ చేరుకుని 2 రోజుల పాటు మంతనాలు జరిపారు. అనంతరం యోగీజీ తన రాజీనామా ని వెనక్కు తీసుకున్నారు.
కేవలం ఒక MP గా ఉన్నపుడే యోగీజీ అల్లర్లను ఆపారంటే, CM గా ఉన్నపుడు ఏమి చేయగలరో వేరేగా చెప్పాలా?
ఇటువంటి గుండ్రాలు గుండ్రాలన్నీ ముఖ్తార్కి కళ్ళముందు కనబడుతూ ఉంటే, ఉత్తరప్రదేశ్ కి రావాలంటేనే తడిసిపోతోంది . మోదీజీ, అమిత్ షాలు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రాగానే యోగీజీ కే ముఖ్యమంత్రి గా ఇందుకే వోటు వేసారు.
-కెవి రమణారెడ్డి