– ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆముదాలవలస: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర బడ్జెట్‌గా ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి కీలకమైన మౌళిక సదుపాయాలు, విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ రంగాలకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం అభినందనీయమని తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను నిలబెట్టే దిశగా ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడంలో, MSME రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్ర బడ్జెట్ స్పష్టమైన దృష్టిని చూపిందని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌలభ్యం, ఉపాధి అవకాశాల పెంపు ద్వారా యువతకు భవిష్యత్ భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు.