– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
– రూరల్ మండలంలో జరిగిన పల్లె పండుగలో…… కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాము
– రూ.79 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే….
గుడివాడ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో నిర్వీర్యమైన పంచాయితీ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి, గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.
గుడివాడ రూరల్ మండలంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో అధికారులు….. కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాము…. కూటమినేతలకు గ్రామ గ్రామాన ప్రజలు ఘన స్వాగతం పలికారు