– ఇది ఆంధ్రుడి ఆత్మగౌరవ శిఖరం!
ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు.. కోట్లాది మంది కలల ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ చరిత్రను, రేపటి తరాల భవిష్యత్తును తిరగరాయబోతున్న ఒక మహా అద్భుతం! ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోనే అత్యంత సంక్లిష్టమైన క్వాంటం టెక్నాలజీ, జీవన ఉనికికి ఆధారమైన బయాలజీ.. ఈ రెండింటి కలయికతో అమరావతి వేదికగా ఒక నవశకం ఆరంభం కాబోతోంది.
కల నిజమవుతున్న వేళ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనం ‘అమరావతి క్వాంటం వ్యాలీ’. కేవలం తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే ఒక ఆలోచన ఆచరణలోకి రావడం అంటే అది ఆంధ్రప్రదేశ్ పాలకుల సంకల్ప బలం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన IBM 133-Qubit Quantum System Two అమరావతి గడ్డపై అడుగుపెట్టబోతోంది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం పాలసీని తెచ్చి, ఏపీని ప్రపంచ టెక్నాలజీ చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెట్టారు.
మొండి వ్యాధులకు చరమగీతం
గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ: సాంప్రదాయ కంప్యూటర్లు తలవంచే చోట, క్వాంటం బయో ఫౌండ్రీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. క్యాన్సర్ వంటి మొండి వ్యాధులకు విరుగుడు కనిపెట్టడం, అత్యాధునిక చికిత్సా విధానాలు, ఎంజైమ్ ఇంజినీరింగ్.. ఇలా మానవాళి ఆరోగ్య సమస్యలకు అమరావతి కేంద్రంగా పరిష్కారాలు లభించబోతున్నాయి. ఇది కేవలం పరిశోధన కాదు, లక్షలాది మందికి ప్రాణదానం చేసే ఒక యజ్ఞం!
ప్రపంచ దిగ్గజాల అడుగుజాడల్లో.. TCS, IBM, CSIR, IIT ఢిల్లీ వంటి దిగ్గజ సంస్థలతో పాటు అంతర్జాతీయ టెక్ కంపెనీలు అమరావతి వైపు చూస్తున్నాయి. మల్టీ-ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖద్వారం కాబోతోంది. వేల కోట్ల పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి హై-వాల్యూ ఉద్యోగాలు మన యువత సొంతం కాబోతున్నాయి.
యువశక్తికి ఊపిరి: లక్ష మంది యువతకు క్వాంటం శిక్షణ, వేల సంఖ్యలో సిద్ధంగా ఉన్న ఫ్యాకల్టీ, వందలాది కాలేజీల నుంచి ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు.. చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ హబ్‌గా మారిపోతోందని స్పష్టమవుతోంది. స్టార్టప్‌లకు స్వర్గధామంగా, డీప్‌టెక్ హబ్‌గా అమరావతి విశ్వరూపం దాల్చబోతోంది.
ఒకప్పుడు ఐటీతో హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది.. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీతో అమరావతిని ప్రపంచానికి దిక్సూచిగా మార్చబోతున్నారు. ఏప్రిల్ 26 నుంచి మొదలయ్యే ఈ ప్రస్థానం, ఆంధ్రప్రదేశ్ గడ్డపై విజ్ఞాన విప్లవానికి నాంది!
గర్వపడదాం.. సిద్ధమవుదాం.. క్వాంటం యుగంలోకి అడుగుపెడదాం!