– సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యువసేన ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ వివేకనంద గౌడ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు చేతివృత్తులకు కుల వృత్తుల సంక్షేమమే లక్ష్యంగా సుబ్బండ వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు, గొల్ల కురుమలకు, ముదిరాజులకు, రజకులకు, నాయి బ్రాహ్మణులకు, దళితుల అభ్యున్నతి కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కల్లు దుకాణాలను మూసివేసి గీత కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్లు దుకాణాలను పునరుద్ధరించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైన్ షాప్ లలో గౌడ్లకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో నీరా పాలసీని తీసుకొచ్చి నీరాను గౌడ్లు మాత్రమే ఉత్పత్తి చేసి అమ్మకాలు జరిపేలా ప్రత్యేక జీవో తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. హైదరాబాద్ మహానగరంలో సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారన్నారు. హైదరాబాద్ కు వచ్చిన వాళ్లు అంబేద్కర్ విగ్రహంతో పాటు నీరా కేఫ్ ను చూడాలని మంత్రి పిలుపునిచ్చారు.బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయులనీ కీర్తించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహాన్ని నిర్మిస్తున్నామన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోటలను పరిరక్షించి వాటిని చారిత్రక పురావస్తు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పాపన్న గౌడ్ ఆశాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లే లక్ష్మణరావు గౌడ్, తెలంగాణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి చింతల మల్లేశం గౌడ్, BRS పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, అఖిలభారత గౌడ సంఘం తెలంగాణ అధ్యక్షులు కూరెళ్ళ వేములయ్య గౌడ్, స్థానిక కార్పొరేటర్ లీలావతి, బింగి భరత్ గౌడ్, స్థానిక గౌడ సంఘాల నాయకులు సాయి గౌడ్, సాయి తదితరులు పాల్గొన్నారు.