సాక్షి పేపర్/ఛానల్ రాస్తున్న వార్తలు చూస్తుంటే.. వాస్తవానికి, వీరికి ఉన్న వితండవాదానికి నవ్వుకోవాలో, ఏడవాలో అర్థం కావట్లేదు. మెడికల్ కాలేజీల విషయంలో సాక్షి చేస్తున్న ప్రచారంపై కొన్ని సూటి ప్రశ్నలు:
కక్ష సాధింపా? వ్యవస్థను చక్కదిద్దడమా?
విద్యార్థులు లేని కాలేజీలో, పాఠాలు చెప్పని ఖాళీ గదుల్లో వందలాది మంది సిబ్బందిని కూర్చోబెట్టి, పనిలేకుండా జీతాలు ఇవ్వడం ‘అభ్యుదయం’ అని సాక్షి భావిస్తోందా? ఎవరినీ తీసేయలేదు, ఎవరి జీతాలు ఆపలేదు. ఖాళీ భవనాలకు కాపలా పెట్టడం కంటే, అవసరం ఉన్న చోట్లకు బదిలీ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుంది?
పులివెందులకు అనుమతి ఎందుకు రాలేదో తెలీదా?
NMC (National Medical Council) పులివెందుల నుండి మిగిలిన కాలేజీల అడ్మిషన్ల అనుమతి ఎందుకు ఇవ్వలేదు? పూర్తి సిబ్బంది లేక, మీరు సగం సగం కట్టిన అరకొర భవనాలు, అసంపూర్ణ వసతుల వల్ల! పునాదులే సరిగ్గా వేయని మీ ‘ఘనత’ను వదిలేసి, ఇప్పుడు బదిలీల మీద ఏడవడం హాస్యాస్పదం.
పరికరాలు తుప్పు పట్టాలా?
వందల కోట్ల విలువైన స్కానింగ్ మిషన్లు, వైద్య పరికరాలను రోగులు లేని చోట ఉంచి తుప్పు పట్టించాలా? అవసరమున్న చోటికి తరలించి ప్రజలకు వైద్యం అందిస్తుంటే దాన్ని ‘దోపిడీ’ అంటారా? మీ తర్కం గబ్బిలాలకు కూడా అర్థం కాదు! పెళ్లి కాకముందే పేర్లు పెడతారా?
కాలేజీ బిల్డింగులే పూర్తి కాలేదు.. అక్కడ స్టాఫ్ లేరని గగ్గోలు పెట్టడం అంటే, పెళ్లి కాకముందే పుట్టబోయే పిల్లలకి పేర్లు పెట్టలేదని గొడవ చేయడమే! నిధులు ఇవ్వక, పనులు పూర్తి చేయక మెడికల్ కాలేజీలను ‘గబ్బిలాల అడ్డాలు’గా మార్చిన గత పాలన, చేతగానితనం జగన్ ది కదా?
PPP అంటే భయమెందుకు?
ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ఆగిపోయిన పనులను, పీపీపీ (PPP) ద్వారా పూర్తి చేసి పేదలకు వైద్యం అందించాలని చూస్తుంటే అది ‘అక్కసు’ ఎలా అవుతుంది? ‘ఎవడొస్తాడో చూస్తా, జైలుకు పంపిస్తా’ అని పెట్టుబడిదారులను బెదిరించే మీ నాయకుడి రంకెలు కక్ష కాదా?
అసంపూర్ణ కట్టడాలను అద్భుతాలుగా చూపించే మీ ‘సాక్షి’ తర్కం అమోఘం! అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేలోపు, నిజం చెప్పులు తొడుగుంటుంది. అబద్ధపు రాతలు ఆపండి.. వాస్తవాలను చూడండి!
//(సాక్షి స్క్రోలింగ్) కడప జిల్లా : మెడికల్ కాలేజీ ఉద్యోగులపై మరోసారి కక్ష సాధింపు – పులివెందుల మెడికల్ కాలేజీ నుంచి 63 మంది ఉద్యోగుల బదిలీ – పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బదిలీ – పీపీపీ కింద ప్రైవేట్ పరం చేయనున్న కాలేజీల్లో ఉద్యోగుల బదిలీ – పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కాలేజీల నుంచి 600 మంది ఉద్యోగుల బదిలీ – జగన్ హయాంలో నియామకం జరిగిందనే అక్కసుతో బదిలీ – ఇప్పటికే మెడికల్ కాలేజీల నుంచి అత్యాధునిక పరికరాలు తరలింపు//
– చాకిరేవు