-గతంలో ఉన్న అనారోగ్య పరిస్థితుల కారణంగానే మరణించింది తప్ప కొవిడ్ వల్ల కాదు
– తేలికపాటి లక్షణాలతో రూపాంతరం చెందిన కోవిడ్ జెయన్1 వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదు
– కెజిహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్
ఆమెకు గతంలో ఉన్న అనారోగ్య పరిస్థితుల కారణంగానే మరణించింది తప్ప కొవిడ్ వల్ల కాదు. ఆమెకు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం, మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్ సిండ్రోంతో పాటు తీవ్రమైన కిడ్నీ వైఫల్యం సమస్యలున్నాయి.ఈ నెల 22వ తేదీన ఆమె వైజాగ్ ఛాతీ ఆసుపత్రిలో అడ్మిటయ్యింది.రొటీన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఆమెకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. తదుపరి నిర్వహణ, డయాలిసిస్ కోసం ఆమెను వైద్యులు 24వ తేదీన కెజిహెచ్ కు తరలించారు.
రక్త నమూనాలను విజయవాడ సెంట్రల్ లేబరేటరీకి జినోమ్ నిర్ధారణ కోసం పంపాం. బ్రతికించేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ మంగళవారం మధ్యాహ్నం ఆమె మరణించింది. కెజిహెచ్ వైద్యులు ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి.