Suryaa.co.in

Telangana

అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో తుమ్మలకు ఘన సన్మానం

అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు , డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ , కాంగ్రెస్ నాయకులు బమ్మిడి శ్రీనివాస్ , అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి వీర్ల వరప్రసాద్, టిపిసిసి మెంబర్ పుచ్చకాయల వీరభద్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ , సహకార శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి క్యాంపు కార్యాలయంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు , సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానం జరిగింది . ఈ సందర్భంగా బమ్మిడి శ్రీనివాస్ తన చేతుల మీదుగా తయారుచేసిన తుమ్మల చిత్రకళాఖండమును తుమ్మలకు బహుకరించడం జరిగింది .

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కురుమ యాదవులు మాట ఇస్తే మాట మీద నిలబడతారని , గత ప్రభుత్వo ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా యాదవ కురుమలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ను ఇచ్చి గెలిపించారని , వారిని తప్పక కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుందని , వారి ఆశయాలు కోరికలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు .

మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ , ప్రత్యేకంగా బీసీ వర్గాలను ప్రోత్సహించి , ఆదరించే మహా వ్యక్తి తుమ్మల అని ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి విషయంలో నలుమూలల తుమ్మల మార్క్ కనబడుతుందని , చిన్న పల్లెటూరులో కూడా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు గొర్రెల పంపిణీ పథకం కొరకు డీడీలు తీసి ఉన్న లబ్ధిదారులకు రెండు లక్షల రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి బదిలి చేయాలని , గొర్రెల మార్కెట్ యార్డు అభివృద్ధి చేయాలని , కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలకు గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇప్పించాలని , మల్లి బాబు యాదవ్ విజ్ఞప్తి చేశారు .

ఈ కార్యక్రమంలో దుబాకుల శ్రీనివాస్ దుబాకుల వెంకటేశ్వర్లు , కార్పొరేటర్ పల్లె బోయిన చంద్రం , మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు , మూడుముంతల గంగరాజు , పొదిల పెద్ద పాపారావు , సత్తి వెంకన్న , పాపయ్య , పొదిల భిక్షం , పల్లెబోయిన పుల్లారావు , రవి , చింతల ఉపేందర్ , నరసింహారావు , రేఖ మురళి , వడ్డేపూడి మల్లికార్జున్ , మంద నాగేశ్వరరావు , బాతుల సుధాకర్ , చంద్రకాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు .

LEAVE A RESPONSE