Suryaa.co.in

Andhra Pradesh

అమరావతికి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదు.. రాదు

ఎస్సీ అధికారులకు పోస్టింగులో అన్యాయం
– ఏపీ సియంఓలో ఎస్సీ అధికారి లేడు
– జిల్లా కలెక్టరేట్ ముందు ఎస్సీ కార్పొరేషన్ ప్రారంభించాలని చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా
– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్

నెల్లూరు: జిల్లా కలెక్టర్ పోస్టింగులలో కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్కరూ కలెక్టర్ గా లేకుండా చేశారు.టిటిడి లో కూడా ఎస్సీ అధికాలులు లేకపోవడం చాలా బాధాకరం. పక్క రాష్ట్రం తమిళ నాడులో సియంఓలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్లే ఉన్నారు. త్వరలో తమిళనాడు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఎస్సీ కాబోతున్నారు.

కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు చెవిలో మల్లెపూలు పెట్టింది. కేంద్ర బడ్జెట్ లో గ్రాంటుగా అమరావతికి పోలవరానికి ఒక్క పైసా నిధులు రాలేదు. అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పడం ఆంధ్రప్రదేశ్ ను దగా చేయడమే.

అమరావతికి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదు. రాదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నచోట అప్పు ఇవ్వరాదని వరల్డ్ బ్యాంక్ నిబంధన లో ఉన్నది. మూడేళ్లలో పోలవరం నిర్మాణం చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. కానీ మరో 20 ఏళ్ల అయినా పోలవరం పూర్తి కాదు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాలనలో పోలవరానికి ఎవరెవరు ఎంత ఖర్చు చేశారు? ఎవరికి కాంటాక్ట్ లు ఇచ్చారు? పోలవరం పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. రెండు కుటుంబాల వల్ల రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆ రెండు కుటుంబాలకు అధికార దాహం ధన దాహం ఎక్కువ.

ఆంధ్రాలో ఐదు కోట్లు మంది తెలుగు ప్రజలు, తెలంగాణలో నాలుగు కోట్ల తెలుగు ప్రజలు ఈరోజు అప్పుల్లో కష్టాల్లో ఉన్నారంటే ఆ రెండు కుటుంబాలే కారణం. తెలంగాణలో ఒక కుటుంబం పదేళ్లు అధికారం లో ఉండి, వేల కోట్లు సంపాదించారు. ఆంధ్రాలో మరో కుటుంబ ం పదేళ్లకు పైగా, కొన్ని రోజులు ఎక్కువగా అధికారాన్ని అనుభవించింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కోరుకుపోయింది.

రాష్ట్ర అప్పులపై వైసీపీ టీడీపీ ఎవరికీ వారు సొంత లెక్కలు చెబుతున్నారు. జగన్ 7లక్షల కోట్లు అప్పు అని అంటాడు. కానీ పయ్యావుల కేశవ్ 13.5 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నదని అంటాడు. ఎవరు మాటల్లో! ఏది నిజమో, ఏది అబద్దమో అర్థం కావడం లేదు. రాష్ట్ర అప్పులపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్లను వెంటనే ప్రారంభించాలి.

జగన్ హయాంలో తాళాలు వేసి, మూతపడ్డ కార్యాలయాలు తిరిగి తెరిపించి, రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు రావాల్సిన బడ్జెట్ ఇవ్వాలి. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు నేను ఎస్సీ అని సర్టిఫికెట్ ఇచ్చిన ప్రతి ఎస్సీ కి లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు.

మన రాష్ట్రంలో కూడా ఎస్సీ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తెచ్చి, దండిగా నిధులు ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా..
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 7 లీడర్ల డీజిల్ పోసి వేల ఫైల్లను దగ్ధం చేశారు. పేదల భూములను లాక్కునే దాని కొరకు ఫైళ్లను దగ్ధం చేశారు. ఈ ఘటనలో ఎవరున్నా… ఎంత పెద్ద వారైనా సరే శిక్షకు అర్హులే. ఈ కార్యక్రమంలో విజయకుమార్, చందనమూడి శివ, రామచంద్రయ్య, విజయబాబు, యానాదయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE