– ప్రజా ధనాన్ని పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాడు
– దేశవ్యాప్తంగా గంజాయికి ఏపీ అడ్డాగా మారిపోయింది
– గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా?
-చిత్తూరుజిల్లా, పుంగనూరు నియోజకవర్గం, కల్లూరులో యువతతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖాముఖి
చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ:
• రాష్ట్రంలో 4సంవత్సరాల నుండి యువత భవిష్యత్తు అంధకారంలో ఉంది.
• యువత భవిష్యత్తును కాపాడేందుకు నారా లోకేష్ యువగళం చేపట్టారు.
• యువత గళాన్ని నొక్కేందుకు ప్రభుత్వం, పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
• రాష్ట్రంలో ఉన్న కంపెనీలను కమీషన్లు ఇవ్వాలని వైసీసీ నాయకులు ఒత్తిడి చేయడంతో రాష్ట్రం నుండి పారిపోతున్నాయి.
• చంద్రబాబు పాలనలో 40వేల కంపెనీలు ఏపీకి వచ్చాయి, యువతకు ఉపాధి అవకాశాలు వచ్చాయి.
• జగన్ రెడ్డి పాలనలో యువత ఉద్యోగాలు పోయాయి. పక్క రాష్ట్రాలకు వలసలు పెరిగిపోయాయి.
• మీ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు సీఎం కావాలి…దీనికోసం మీరంతా కలిసికట్టుగా పనిచేయాలి.
లోకేష్ తో యువత మాట్లాడుతూ….
విద్యార్థి : మాకు సరైన విద్య లేదు. చుట్టుపక్కల డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు లేవు. దూరం వెళ్లాలంటే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలి. ఛార్జీలు పెరిగిపోయాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. మాకు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు తెస్తారా?
నారా లోకేష్: ఏపీని ఐటీ హబ్ గా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు అనేక కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలాది ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. డిగ్రీ కాలేజీలు అందుబాటులోకి తీసుకువచ్చారు. మీ కోరిక మేరకు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీని తీసుకొస్తాం. కేజీ టు పీజీ విద్యార్థులకు ఆర్టీసీలో ఫ్రీ ఛార్జీ పెడతాం. పుంగనూరు ఎమ్మెల్యే ఇక్కడి యువత భవిష్యత్తును నాశనం చేశారు.
కుమార్: నేను రైతును. ఉద్యోగాలు లేక వ్యవసాయం చేస్తుంటే ఇదీ నష్టదాయకంగానే ఉంది. మమ్మల్ని మీరు ఏవిధంగా ఆదుకుంటారు?
లోకేష్: చంద్రబాబు వ్యవసాయంతో పాటు, అనుబంధ రంగాలను పెద్దఎత్తున ప్రోత్సహించారు. రైతులకు విత్తనాలు నుండి పంట రవాణా చేసే వరకు అయ్యే ఖర్చులను తగ్గించాలని చంద్రబాబు నిర్ణయించారు. గతంలో భూసార పరీక్షలు చేశాం. ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. అన్ని విధాలా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాం. జగన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశాడు. గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3,500కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని మాట తప్పాడు. మనం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పునర్ నిర్మించుకోవాల్సి ఉంది. నాణ్యమైన విత్తనాలు తయారు చేసుకునే విషయంలో యువత ఆసక్తి చూపాలి. మేం అధికారంలోకి వచ్చాక పెట్టుబడి ఖర్చు తగ్గిస్తాం. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆదుకుంటాం. జగన్ రెడ్డి రైతులకు మోటార్లకు మీటర్లతో ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నాడు. వాటిని తిరస్కరించండి.
సునీల్: పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి అని జగన్ రెడ్డి చెబుతున్నాడు. మాకు ఉద్యోగాలు రావడం లేదు. భవిష్యత్తులో అయినా మాకు ఉద్యోగాలు వస్తాయా?
లోకేష్: ఏపీలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసింది టీడీపీ. టీడీపీ పాలనలో 40వేల పరిశ్రమలతో 6లక్షల ఉద్యోగాలు తెచ్చామని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుంది. మనం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తాయి. నేను మాట ఇస్తున్నా. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో మన రాష్ట్రం వాళ్లే అధికంగా ఉన్నారు. అది చంద్రబాబు ఘనత. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. టీడీపీ పాలనలో మనం చేసుకున్న ఒప్పందాల తర్వాత 2019లో మనం అధికారంలోకి వస్తే ఇప్పటికే 50లక్షల ఉద్యోగాలు వచ్చేవి. మనం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో పరిశ్రమలు, ఉద్యోగాలు తెచ్చే బాధ్యతను మేం తీసుకుంటాం.
రవికిషోర్: నేను పీఈటీగా పనిచేస్తున్నాను. పిల్లల్లో క్రీడా స్ఫూర్తి లేదు, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక విద్యా, క్రీడా రంగంలో మార్పులు తెస్తారా?
లోకేష్: నో డౌట్ బ్రదర్. బాబు విద్య ఉద్యోగాలు తెస్తే, జగన్ పాలనలో పాఠశాలల వద్దకే గంజాయి తెచ్చారు. దీనిపై నేను మాట్లాడితే తిరుపతి ఎస్పీ భుజాలు తడుముకున్నాడు. దేశవ్యాప్తంగా గంజాయికి ఏపీ అడ్డాగా మారిపోయింది. వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకోవడానికి యువత భవిష్యత్తును గంజాయికి బలిచేస్తున్నారు. చివరకు 10వ తరగతి విద్యార్థులను గంజాయి సప్లయర్లుగా మర్చేశారు. చంద్రగిరిలో ఓ యువతిని గంజాయికి వైసీపీ నాయకులు బానిసలుగా చేశారు. దయచేసి యువత గంజాయికి నో చెప్పండి. జగన్ రెడ్డి పాలన పోయే వరకు యువత అప్రమత్తంగా ఉండాలి. మనం అధికారంలోకి వచ్చాక కాంపిటీటీవ్ కు తగినట్టుగా సిలబస్ ను మొదటి సంవత్సరంలోనే మారుస్తాం. చిత్తూరుకు స్పోర్ట్స్ యూనివర్శిటీ తీసుకొస్తాం. ఉమ్మడి ఏపీలో పుల్లెల గోపీచంద్ కు భూమి కేటాయించి అకాడమీ పెట్టిస్తే మన దేశానికి ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చాయి. స్పోర్ట్స్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం.
వలీ: మెరుగైన వైద్యం కోసం మేము బెంగళూరు, చెన్నైకి పోవాల్సి వస్తోంది. పుంగనూరులో 100పడకల ఆసుపత్రి ఉన్నా సదుపాయాలు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక అయినా ఇక్కడ వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తారా?
లోకేష్: పెద్దిరెడ్డి మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినా వైద్య సదుపాయాలు తీసుకురాలేకపోయాడు. నియోజకవర్గ ప్రజలకు వైద్యాన్ని మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అందుబాటులోకి తెస్తాం. జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా దొరకని దుస్థితి వచ్చింది. పేదవాళ్లకు వైద్యం దక్కడం లేదు. చిత్తూరు జిల్లాకు మెడికల్ యూనివర్శిటీని తీసుకొస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం.
నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుంగనూరుకు రూ.100కోట్లు కేటాయిస్తే పెద్దిరెడ్డి పనులు చేయలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు ఇక్కడ ఒక్క పనికూడా చేయలేదు. 13కిలోమీటర్లకు 32కల్వర్టులు నేను ఎక్కడా చూడలేదు. ప్రజా ధనాన్ని పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాడు. పెద్దిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి మెడికల్ కాలేజీ తెచ్చేవాడు. కానీ మనసు లేదు. మమ్మల్ని గెలిపించండి మీరు కోరినవి తెస్తాం.
శివకుమార్: యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఉంటుందా?
లోకేష్: ఉత్సాహవంతులైన యువతకు జాతీయ స్థాయి వరకు అవకాశాలు ఉన్నాయి. టీడీపీలో 40శాతం యువతకు పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. మంగళగిరిలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి నేను శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా. మొదటి ప్రయత్నంలో నేను ఓడినా అలసిపోకుండా నేటికీ పోరాడుతున్నా. మా కుటుంబ సభ్యులు చనిపోయినా సరే నా పాదయాత్రను నేను కొనసాగిస్తున్నా. మీరు నాతో అడుగులు కలపండి.
సునీల్: మీరు రూలింగ్ లోకి వచ్చాక ఏపీకి పెట్టుబడులు, ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు? గంజాయి కట్టడికి ఏం చర్యలు తీసుకుంటారు?
లోకేష్: రాజంపేట ఎంపీగా ఒక వ్యక్తిని మీరు రెండుసార్లు గెలిపించారు. ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా? లేదు. పెద్దిరెడ్డిని ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిపించారు. మీకు ఉపయోగం లేదు. పాపాలు చేసే వారిని, మోసాలు చేసేవారిని గెలిపించి, ఉపయోగపడేవారిని పక్కనబెడితే మీకు పరిశ్రమలు, ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఈ పుంగనూరులో పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ తప్ప, మరేదైనా డెయిరీ ఉందా? లేదు. కేవలం వాళ్లు దోచుకోవడం తప్ప మరేమీ లేదు. పల్ప్ కంపెనీ పెద్దిరెడ్డి తమ్ముడి కొడుకు పెట్టి రైతులను దోచుకుంటున్నాడు. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే టీడీపీ ని గెలిపించండి. మీకు నిజమైన అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. పెద్దిరెడ్డి కుటుంబం ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్నంతకాలం మీ పుంగనూరుకు ఏమీ రావు. టీడీపీ పాలనలో స్మగ్లర్లు, దొంగలు, దోపిడీదారులు, హంతకులు భయపడేవారు. జగన్ రెడ్డిని చూసి ఎవరూ భయపడడం లేదు. జగన్ రెడ్డి పాలనలో గంజాయి స్మగ్లర్లు పేట్రేగిపోయారు. అనంతబాబు అనే వైసీపీ ఎమ్మెల్సీ గంజాయి స్మగ్లర్. వాడు దళిత డ్రైవర్ ను చంపితే వైసీపీ వాళ్లు ఘనంగా సన్మానించారు.
శేఖర్, సదుం మండలం, చీకల చేను గ్రామం: మా గ్రామంలో యువతపై వైసీపీ వాళ్లు 307 కేసులు పెట్టారు. రాజకీయాల్లో మేం తిరుగుతుంటే పెద్దిరెడ్డి వర్గం మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు.
లోకేష్: జగన్ రెడ్డి పాలనలో ఎక్కువగా నష్టపోయింది చిత్తూరు జిల్లా. 2019 మే వరకు నాపై ఒక్క కేసు కూడా లేదు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నాపై నేటికి 20 అక్రమ కేసులు పెట్టారు. 307, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పాదయాత్రలో ప్రతి 33కిలోమీటర్లకు ఒక కేసు పెట్టారు. పుంగనూరు టీడీపీ నాయకులపైనే రాష్ట్రంలో అధికంగా కేసులు ఉన్నాయి. కేసులు పెట్టింది పాపాల పెద్దిరెడ్డి. భారతదేశంలో అత్యధికంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీలు ఏపీలోనే బనాయిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి, ప్రధానికి మనం ఫిర్యాదు చేద్దాం. మీరు పోరాడండి. మీకు నేను అండగా ఉంటా. కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.
ప్రవీణ్ కుమార్, పాండిచ్చేరిలో బీటెక్ ఫస్టియర్: ఈ సీఎం స్కాలర్ షిప్ లు ఇవ్వడం లేదు, అస్తవ్యస్తంగా ఉన్నఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని సరిదిద్దాలి.
లోకేష్: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కాలర్ షిప్ విధానాన్ని రద్దు చేసి వసతి దీవెన, విద్యాదీవెన అనే పనికిమాలిన పథకాలను తెచ్చారు. కేవలం రూ.15వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. గత ప్రభుత్వాలన్నీ కాలేజీ యాజమాన్యానికి విద్యార్థికి సంబంధించిన ఫీజును ప్రభుత్వమే నేరుగా చెల్లించేది. మనం అధికారంలోకి వచ్చాక స్కాలర్ షిప్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. పీజీ విద్యార్థులకు రీయింబర్స్ మెంట్ జగన్ రెడ్డి రద్దు చేశాడు. పీజీలు చదవకుండా పేద విద్యార్థులపై వివక్ష చూపిస్తున్నాడు. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతంలో స్టార్టప్ కార్యక్రమాలను టీడీపీ నిర్వహించింది. తిరుపతిలోనూ దాన్ని అమలు చేశాం. స్టార్టప్ కు సంబంధించిన సలహాలు, సూచనలు, సహకారం అందించాం. జగన్ రెడ్డి కేవలం గంజాయి స్టార్టప్ మాత్రమే తెలుసు. మనం అధికారంలోకి వచ్చాక స్టార్టప్ విధానాన్ని ప్రోత్సహిస్తాం. మీరంతా ఒక్కొక్కరూ ఓ వెయ్యి మందికి ఉద్యోగాలిచ్చేలా చేస్తాం.
కార్యక్రమం చివర్లో నారా లోకేష్ మాట్లాడుతూ…
• 34రోజులుగా పాదయాత్ర చేస్తున్నాను. దీనికి కారణం యువత.
• జగన్ రెడ్డి సీఎం అయిన దగ్గర్నుండి పరిశ్రమలను రాష్ట్రం నుండి తరిమేస్తున్నాడు.
• యువతకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.
• దుష్టపాలనను రాష్ట్రం నుండి తరిమేయాలనే ఉద్దేశంతో నేను యువగళం ప్రారంభించాను.
• ఫాక్స్ కాన్ అనే కంపెనీ మన రాష్ట్రం నుండి వెళ్లిపోయి తెలంగాణకు చేరింది. అక్కడ లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తోంది. తాజాగా కర్నాటక రాష్ట్రంతోనూ ఈ కంపెనీ ఒప్పందం చేసుకుంది.
• శ్రీ సిటీలో షావోమి సెల్ ఫోన్ కంపెనీని మనం స్థాపించాం.
• టీడీపీ తెచ్చిన కంపెనీలను జగన్ రెడ్డి నిలబెట్టి ఉంటే ఈ రెండేళ్లలో 2లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ తరిమేశాడు.
• జే ట్యాక్స్ కోసం వేధించి ఒక్కో సంస్థను రాష్ట్రం నుండి జగన్ రెడ్డి తరిమేస్తున్నాడు.
• ఇదే కొనసాగితే ఏపీ యువత కేరాఫ్ అడ్రస్ తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, చివరకు ఉత్తర ప్రదేశ్ కూడా అయ్యే ప్రమాదం ఉంది.
• గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా?
• రాష్ట్రంతో జగన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఏ సంస్థకూ రాష్ట్రంపై నమ్మకం కుదరడం లేదు.
• యువత గ్రామ స్థాయి నుండి పోరాడండి. పని చేయండి. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మీ వంతు సహకారం అందించండి.
• అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులన్నీ రద్దు చేస్తాం. పోరాడిన యువతకు పెద్దపీట వేస్తాం.
• కుప్పం, పలమనేరుకు పరిశ్రమలు వచ్చాయి. కానీ పుంగనూరుకు పరిశ్రమలు రాలేదంటే ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి నియోజకవర్గ ప్రజలపై ఎంత చిన్న చూపో ఆలోచించండి.
• యువత ఆలోచించాలి. మీకు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఎమ్మెల్యే న్యాయం చేస్తాడో నిర్ణయించుకోవాలి.
• ప్రైవేటు, ప్రభుత్వ, స్వయం ఉపాధి రంగాల్లో యువతకు మేం అధికారంలోకి వచ్చాక అవకాశాలు కల్పిస్తాం.
• 2025 జనవరి నుండి ప్రతి యేటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం.
• బడుగు, బలహీన వర్గాలు, ఓసీ పేదలకు కూడా కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి అకాశాలు కల్పిస్తాం.
• ఏపీ నుండి పక్కరాష్ట్రానికి వలసలు వెళ్లడాన్ని అరికట్టి…పక్క రాష్ట్రం నుండి ఏపీకి వలసలు వచ్చేలా చేస్తాం.
• ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యతను మేం కల్పిస్తాం.
• విభజన జిల్లాల ప్రాతిపదికన ఒక్కో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.