– ఇక ఎన్నికలకు సిద్ధం అని పిలుపు ఇవ్వనున్న జగన్ మోహన్ రెడ్డి
– రాష్ట్ర వ్యాప్తంగా మూడు “సిద్ధం” పేరు తో మూడు సభలు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల పొత్తులు, ఆరోపణలు దృష్ట్యా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27 నుంచి ఎన్నికల సమరానికి తొలి అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 27న భీమిలిలో జరగబోయే సభ నుంచి ఎన్నికలకు మేము “సిద్ధం” అనే సవాలను ప్రతిపక్ష పార్టీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు,కార్యకర్తలు, అభిమానులును ఉద్దేశించి రాబోయే కాలంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాచరణ గురించి చెప్పనున్నారు.
ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు,నాయకులు,కార్యకర్తలు, అభిమానులు సుమారు 4 లక్షల మంది ఈ భీమిలి సభలో పాల్గొంటారని వై వి సుబ్బారెడ్డి తెలిపారు.