Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడు మణిపూర్‌పై షర్మిల మాట్లాడలేదెందుకు?

– వైఎస్సార్‌పై రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను షర్మిల ఎందుకు ప్రశ్నించలేదు?
– వాచ్‌ ఇచ్చినట్లు ఎవరైనా చూశారా..సొల్లు వాగుడు వాగుతున్నారు
– రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకుండా గేమ్‌ ఆడాలని చంద్రబాబు చూస్తున్నాడు
– ప్రభుత్వ సలహాదారు, వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

షర్మిల అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజకీయ తెరమీద ప్రత్యక్షం అయ్యారు. రావడం రావడమే తన మార్క్ కోసం విమర్శలు, వ్యంగాస్త్రాలకు పూనుకున్నారు. ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, రాజకీయాల గురించి కానీ ఆమెకు ఏ మాత్రం అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే ఆమె మాట్లాడే మాటల్లో ఒకదానికి మరో దానికి పొంతన ఉండటం లేదు.

నాకైతే ఒక కాంపిటీషన్‌ పరీక్షకు బట్టీ పట్టి ప్రిపేర్‌ అయ్యి పిల్లలు వచ్చి మాట్లాడుతున్నట్లు ఆమె ప్రసంగం కనిపిస్తోంది. కుటుంబం గురించి ముఖ్యమంత్రి అన్న కాంటెస్ట్‌ వాస్తవం. రాజశేఖరరెడ్డి ఆశయాలను తుంగలో తొక్కి, ఆయన పథకాలు పక్కన పెట్టారు.

ఆయన మరణం వల్ల మరణించిన కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు చేపడితే అడ్డంగా నో చెప్పారు. దాని తర్వాత కక్ష సాధింపు మొదలు పెట్టి వేధించిన విషయం షర్మిలమ్మకు కూడా తెలుసు. సోనియా గాంధీని కలిసినప్పుడు జగన్‌, విజయమ్మ , షర్మిలమ్మ..ముగ్గురే ఉన్నారు. అక్కడేం జరిగిందో కూడా ఆమెకు తెలుసు.

ఎవరన్నా ఆమెను గుర్తించినా రాజశేఖరరెడ్డిగారి గౌరవం వల్ల వచ్చిందే. ఎవరూ కాదనడం లేదు…రాజశేఖరరెడ్డి గారి బిడ్డ..జగన్‌ చెల్లెలుగా ఆమెకు ఇచ్చే గౌరవం అభిమానులు ఇస్తారు. గుండెల్లో పెట్టుకుంటారు.

ఏం అన్యాయం జరిగిందో ఆమే చెప్పాలి:
– ఇంత శ్రమ పడితే నాకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఏం అన్యాయం జరిగిందో ఆమె స్పష్టంగా చెప్పాలి.
– పదవుల పంపకంలో అన్యాయం చేశారా? కుటుంబం పదవులు పంచుకోడానికి ఉందా? అది సబబేనా?
– అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది చర్చించడానికి కూడా అర్హమైనదేనా?
– అలాంటప్పుడు అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? రాజకీయ పార్టీ ఎలా అవుతుంది?
– ఒక సారి మొదలు పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ తన స్వరూపాన్ని తాను తీసుకుంటుంది.
– అందులో పునాదులు పడ్డ దగ్గర నుంచి ఉన్నవాళ్లు ఉంటారు.. మధ్యలో జాయిన్‌ అయిన వారుంటారు.
– ఎంత బలంగా కొత్త ఆలోచనలను తీసుకోగలగుతుందో అంత కాలం అది నిలబడుతుంది.
– ఉదాహరణకు వైఎస్సార్టీపీ తీసుకోండి. అక్కడ కూడా ఆ పార్టీ కోసం చాలా మంది కష్టపడి ఉంటారు కదా..వారికి ఏం న్యాయం చేశారు?
– వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేశారు..ఏ రాజకీయ పార్టీలోనైనా అది కుదురుతుందా?
– పదవి కోసమే ఆమె ఆ రోజు అన్నకోసం నిలబడి చేశారా అనేది కూడా స్పెసిఫిక్‌గా చెప్పగలిగితే జవాబు ఇవ్వొచ్చు.
– ఆమెకు ఏం అన్యాయం చేశారు..? ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి.
– ఆ రోజు అందరూ కష్టపడ్డారు. లక్షలాది మంది కార్యకర్తలు కదిలారు..త్యాగాలు చేశారు. పార్టీ ఎదుగుదలలో లక్షలాది మంది కార్యకర్తల పాత్ర కూడా ఉంది.
– నేలకు కొట్టిన బంతిలా జగన్‌ కూడా పైకి ఎదిగారు. అందులో లక్షలాది కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు, నాయకులు అడుగులో అడుగు వేశారు.
– అందులో అందరి పాత్ర ఉంది. షర్మిల పాత్ర ఉంది..విజయమ్మ పాత్ర ఉంది..ఏదో ఒక లెవల్‌లో అందరిదీ ఉంటుంది.
– అలా పాత్ర ఉండబట్టే పార్టీ ఈనాటికీ నడుస్తోంది.
– రాజకీయ పార్టీగా ఒక వ్యవస్థ తయారయ్యాక..అధికారంలోకి వచ్చి నిలబడ్డాక అనేక నిర్ణయాలు తీసుకుంటుంది.

వైఎస్సార్‌ స్కీంలు లేవంటే తీసుకున్న వాళ్లంతా ఎవరు?:
– తనకు అన్యాయం జరిగినా సరే..రాజశేఖరరెడ్డి అశయాలు అమల్లోకి రాలేదు అంటున్నారు.
– అది విన్నాక ఏమనాలో అర్ధం కావడం లేదు. బహుశా ఆమెకు తెలియకపోయి ఉండొచ్చు. వాస్తవాలు ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు.
– ఆమె ఎంత వరకూ పోతున్నారంటే..ఆనాడు వైఎస్సార్‌ ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసాలు లేవంటున్నారు.
– రైతులకు సంబంధించి నేడు ఇస్తున్నంత భరోసా ఎక్కడైనా ఉందా?
– అసలు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ లేదంటున్నారు..తీసుకున్న రైతులంతా ఏమనుకుంటారు..?
– ఇంత అబద్ధం పాపం తెలియక మాట్లాడి ఉండొచ్చు..ఎందుకంటే స్క్రిప్ట్‌లో ఇచ్చింది మాట్లాడి ఉండొచ్చు.
– బహుశా చంద్రబాబు కూడా వీటిపై మాట్లాడటానికి సాహసం చేయకపోవచ్చు.
– మహా అయితే.. నా చంద్రన్న కానుకలు లేవు అనొచ్చు కానీ.. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లేవని మాత్రం అనలేడు.
– ఇంత అడ్డగోలు అబద్ధమైతే చంద్రబాబు కూడా ఆడి ఉండడు.
– నాడు వైఎస్ఆర్ అమలు చేసిన ఆయా పథకాలకు మరింత పదును పెట్టాం. ఆరోగ్యశ్రీ ఆరోజుతో పొలిస్తే 3వేలకు పైగా ప్రొసీజర్స్‌ పెంచారు.
– రూ.25 లక్షల వరకూ పరిమితి పెంచారు..అర్హత కోసం రూ.5 లక్షలు ఆదాయం చేశారు. 90 శాతం కుటుంబాలు కవర్‌ అవుతున్నాయి. ఇవి నిజం కాదా?
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆనాడు రూ.30–35 వేలు ఇస్తుంటే ఇప్పుడు వంద శాతం చెల్లిస్తున్నది వాస్తవం కాదా?
– కేవలం జగన్‌ చెల్లెలు, రాజశేఖరరెడ్డి బిడ్డ అనే ఏకైక అర్హతతో ఇక్కడకు సోనియా గాంధీ తెచ్చి ఈ పోస్టు ఇచ్చింది.
– రోజు రోజుకు అబద్ధాలతో ఎటాక్‌ పెంచుతున్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనించాలి.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించలేదెందుకు..?:
– తెలంగాణలో రెండున్నరేళ్లపాటు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని నడిపినట్లున్నారు.
– పార్టీ పెట్టినప్పుడు మీడియా మమ్మల్ని అడిగితే విష్‌ హర్‌ ఆల్‌ ది బెస్ట్‌ అనే చెప్పాం.
– వైఎస్సార్‌ బిడ్డగా, జగన్‌ చెల్లిగా సక్సెస్‌ అయితే హ్యాపీగానే ఫీలవుతాం అని చెప్పాం.
– కారణాలు ఏమైనా కానీ ఆ జర్నీ సడన్‌గా కట్‌ అయ్యింది.
– ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను భుజానికి ఎత్తుకుని మోస్తుందో…ఆ ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఏ రోజైతే జగన్‌ గారిపై బాణాలు ఎక్కుపెడతారో దాన్నే హైలెట్‌ చేస్తారు.
– ఆఖరున కాంగ్రెస్‌ ఆమెను అడగకపోయినా ఆమె అంతట ఆమే స్వచ్ఛందంగా పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేశారు.
– ఫలితాలు వచ్చాక నీ వల్ల మాకు మేలు జరిగింది అని ఎవరైనా ఆమెకు థాంక్స్‌ చెప్పారా?
– సరే..ఈ మీడియా అయినా, త్యాగం చేసిన షర్మిలను కాంగ్రెస్‌ గుర్తించలేదు అని రాశారా? అంటే అదీ లేదు.
– అసలు తెలంగాణలో ఆమె ఇర్రెలవెంట్‌ ఎందుకు అయ్యారు..ఆనాడు కాంగ్రెస్‌ను తిట్టారు..ఆఖరుకు ఆ పార్టీలోనే కలిశారు.
– పార్టీ మూసేసిన తర్వాత ఆమె కాంగ్రెస్‌ పక్షాన టీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందుకు తిరగలేదు?
– న్యాయమైన పోరాటం ఉన్నదన్నప్పుడు ఆమె తన రోల్‌ ఎందుకు ప్లే చేయలేదు..?
– ఈ మధ్య కూడా రేవంత్‌రెడ్డి కూడా ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి ఆనాడు వలసలను ప్రోత్సహించారని..దానివల్ల ప్రకృతి గుణపాఠం చెప్పింది అన్నట్లు మాట్లాడారు.
– అలా అన్నప్పుడు అలాంటి పార్టీలో ఉండి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు?
– బహుశా ఈ రోజు మాట్లాడింది చూస్తే…ఆమె ఏ స్టేట్‌లో ఉండి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు.
– ఆమె తెలంగాణాలోనే ఉండి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో..

ఏం ఆశించి ఆమెకు అశాభంగం కలిగిందో చెప్పాలి:
– తనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారో చెప్పాలి.
– ఏం ఆశించి ఆశాభగం కలిగిందో కూడా చెప్పాలి. రాజకీయాలనేవి పదవులను కుటుంబంలో పంచుకోడానికేనా అనేది కూడా చెప్పాలి.
– ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నడపడం ఆదర్శప్రాయంగా ఉందా లేదా అనేది ముఖ్యం.
– ప్రజలు ఒక రాజకీయ పార్టీని ఎన్నుకునేది మంచి చేస్తారని..దాని అధినేతగా ఆయన ఆలోచనలు పరిపాలనలో, పార్టీలో ప్రతిబింబిస్తాయి.
– పార్టీని ఆరోగ్యకరంగా ఉంచడానికి బంధాలకు అతీతంగా నడపడం ఆదర్శప్రాయం.
– అది వద్దని ఆమె అనుకుంటున్నారా..దాంట్లో నాకు ఇంత వాటా రావాలి..రాలేదు అంటున్నారా అనేది కూడా చెప్పాలి.

సాక్షాత్తు మోడీ సభలోనే హోదా, విశాఖ స్టీల్‌పై జగన్‌  గళమెత్తారు
– వైఎస్సార్సీపీ..బీజేపీకి ఒక టూల్‌లా మారింది..వారికి రాష్ట్రాన్ని అప్పజెప్పింది అని షర్మిల ఆరోపణలు చేశారు. ఏరకంగానో చెప్పాలి. ఇక్కడున్న పథకాలు బీజేపీవా? ఇక్కడి ఆలోచనలు బీజేపీవా?
– పోరాటం అంటే నిర్వచనం, స్వరూపం ఎలా ఉండాలో ఆమే చెప్పాలి.

వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడు మణిపూర్‌పై మాట్లాడలేదెందుకు..?
– మణిపూర్‌ అంశం షర్మిలమ్మ వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడెందుకు ఆమె మాట్లాడలేదు?
– అప్పుడు ఆమె ఎజెండాలో ఇది ఎందుకు లేదు? అక్కడెందుకు పోరాటం చేయలేదు?
– ఇక్కడకు రాగానే బీజేపీ, మణిపూర్‌ అంటూ క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందనడంలో అంతర్యం తెలియడం లేదా?
– ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఆయనకు రావాలి..అలాగే వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితుల ఓట్లు కోసం మాత్రమే ఆమెను తీసుకొచ్చారు.
– అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు. అవే పలుకులు ఆమె మాట్లాడుతున్నారు.

హృదయాలను టచ్‌ చేసినందుకు నా జన్మ ధన్యమైందనడంలో తప్పేముంది..?
– జగన్‌ ది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన ఏదీ తన హక్కు అనుకోరు. మన రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. ఆ స్పృహ జగన్‌ కి ఉంది.
– ఎప్పుడైనా ప్రజలే నిర్ణేతలు అని ఆయన గట్టిగా నమ్ముతారు. ఐదేళ్ల తర్వాత ఫ్రెష్‌గా వెళ్లాలి..ప్రజల దీవెనలు కోరాలి. చెప్పుకోవాలని భావిస్తారు.
– ఇండియా టుడే రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఇంటర్వ్యూలో ఏమడిగాడు..? మీకిది సంతృప్తినిస్తోందా అని అడిగారు..దానికి భావోద్వేగంతో జగన్‌ రియాక్ట్‌ అయ్యారు.
– నాలుగున్నరేళ్ళ తన పాలనలో ఇన్ని కోట్ల మంది హృదయాలను టచ్‌ చేసినందుకు నా జన్మ ధన్యమైందని చెప్తూ…ఒకవేళ తప్పుకోవాలన్నా పూర్తి సంతృప్తితో చేస్తాను అన్నారు.
– ఎవరు ఇలా అనగలరు..ఒక మహా స్థితిప్రజ్ఞుడు మాత్రమే అనగలడు.
– నేనేం చేయగలిగాను…అని చెప్పుకోడానికి జగన్‌ గారికి ఎంతో ఉంది. ఆ తృప్తినే వారు వ్యక్తీకరించారు.
– దానికి ఓ చిల్లర భావాన్ని ఇచ్చి సంతోషిస్తే ఏం చేయలేం.
– ఇప్పుడే కాదు..రాబోయే 30 ఏళ్లు నేనే ఉంటాను అంటే చెల్లుతుందా ప్రజాస్వామ్యంలో?
– వినయంతో, వినమ్రతతో ప్రజలే నిర్ణేతలు అని గుర్తించిన ఒక మంచి నాయకుడు మాట్లాడగలిగిన మాటే జగన్‌ మాట్లాడారు. దాని భావం అలానే ధ్వనిస్తుంది.
– అలా కాదనుకునే వారు రెండు రోజులు భ్రమల్లో ఉండటానికి ఉపయోగపడుతుంది తప్ప ఏమీ ఉండదు.

చేసింది ప్రచారం చేసుకోవడంలో తప్పేముంది..?
– ప్రజలకు చేసినవన్నీ చెప్పుకోవడం అందరూ చేసేవే. విద్యారంగంలో మేం తీసుకొచ్చిన సంస్కరణలు చెప్పుకుంటున్నాం.
– మేం చేసింది చెప్పుకోడంలో తప్పేముంది?
– మనం ఏం చేశామో ప్రపంచానికి తెలియాలని ఇండియా టుడే కాంక్లేవ్‌ కు ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
– జగనన్న వదిలిన బాణం తిరిగి జగన్‌ మీదకే వచ్చిందన్నప్పుడు చంద్రబాబు ఎందుకు ఇక మాట్లాడటం? తనపని తాను చూసుకోవచ్చు కదా?
– ఆయన మాటతో సహా అన్నీ ఈమె నోట్లోంచే ఎలా వస్తున్నాయి..వారి మధ్య ఏం ఒప్పందం కుదిరింది?
– ఏబీఎన్‌ రాధాకృష్ణ నిరంతరం ఏ రకంగా మానిటర్‌ చేస్తున్నాడు..వాళ్ల పేపర్లో ఎందుకంత కవరేజ్‌ వస్తోంది?
– సడన్‌గా ఈ మాటలన్నీ ఎలా వచ్చాయి..మాకు సబంధం లేదంటే వీటికి సమాధానం చెప్పాలి.
– న్యాయమూర్తులకు వాచ్‌ ఇచ్చినట్లు ఎవరైనా చూశారా..సొల్లు వాగుడు వాగుతున్నారు.
– నరసరావుపేట ఎంపీ సీటు బీసీకి ఇవ్వాలనుకున్నాం. ఆయన్ను గుంటూరు వెళ్లమని చెప్పాం.
– ఆయనకు అక్కడే కావాలన్నారు…వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నాక ఇక మేమేం మాట్లాడతాం?
– నచ్చచెప్పడానికి, అందర్నీ కలుపుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని కుదురుతాయి..కొన్ని కుదరవు.
– రాజకీయాల్లో ఇవన్నీ సహజం. మా వైపు నుంచి మేం ముందే అభ్యర్థుల మార్పులు చేర్పులు మొదలుపెట్టాం..కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
– ప్రజలకు మేం ఒక స్పష్టమైన పిక్చర్‌ ఇస్తున్నాం.
– అక్కడ పొత్తు ఎవరో తెలియదు..ఒకరు 70 సీట్లు అంటారు..ఈయన 30 కంటే ఇవ్వను అన్నాడంటారు.
– చంద్రబాబు…పవన్‌ ఇచ్చినవి పక్కన పడేశాడు అంటారు..
– ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్‌ వారిని ఎక్కడ నిలబెడతాడో తెలియదు.
– మున్ముందు వాళ్ల రాజకీయం రంజుగా ఉంటుంది…
– మార్పు ఉందంటే ఉంది..చెప్పలేదంటే మార్పు లేనట్లే.
– జగన్‌ టీం సిద్ధమైంది…నిర్మాణాత్మకంగా ఎన్నికలు వెళ్తున్నాం.

LEAVE A RESPONSE