రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా?

-సీఐడీ డీజీని రీకాల్ చేయాలి
-పోలీసులు బరితెగించి చేస్తున్నారు
-వారిని ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెడతా
-మేం ఇలా చేసి సాక్షి ఆఫీస్ నుంచి ఎవరినైనా అరెస్టు చేసి ఉంటే ఎలా ఉండేది?
-చంద్రబాబు నాయుడు

టీడీపీ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర కుటుంబాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. కుటుంబానికి పార్టీ దన్నుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.narendra-babuఅనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ డీజీ సునీల్‌ను రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అసలు డీజీపీ ఉన్నాడా? అని నిలదీశారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

నరేంద్రతో మాట్లాడాను. మీడియా సమన్వయకర్తగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.సిఐడి అధికారులు నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారు.మేం ఇలా చేసి సాక్షి ఆఫీస్ నుంచి ఎవరినైనా అరెస్టు చేసి ఉంటే ఎలా ఉండేది? కేవలం భయభ్రాంతులకు గురి చేయటం కోసమే అరెస్టు చేశారు. నాకు తెలియగానే డిజిపి కి లేఖ రాశాను, నరేంద్రను హింసిస్తారనే సమాచారం మేరకే లేఖ రాశాను.అయినా నరేంద్రను రాత్రి సమయంలో చిత్ర హింసలు పెట్టారు.గోడ కుర్చీ వేయించి గుంజిల్లు తీయిస్తారా? పిచ్చి ముఖ్యమంత్రి ఉన్నారని ఎలా పడితే అలా చేస్తారా?తప్పు చేయని వ్యక్తిని ఇలా చిత్రహింసలకు గురి చేశారంటే రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంది.రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయింది.మా హయాంలో పోలీసులని ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థ గా చూశాను.

కానీ ఇప్పుడు మాత్రం పూర్తి విరుద్ధంగా జరిగితోంది.ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరి పారిపోవటం ఖాయం.ఎంత మందిపై ఇలా దాడులు చేస్తారు.నరేంద్ర కు టిడిపి అండగా ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వం బరితెగించింది వ్యవహరిస్తోంది.ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి శిక్షించటం ఖాయం.నరేంద్ర చేసిన తప్పేంటని అడుగుతున్నా. గన్నవరం విమానాశ్రయంలో బంగారం పట్టుబడిన వ్యవహారం పై చాలా మంది పోస్టులు షేర్ చేశారు.

పార్టీ మీద అభిమానంతో కమిట్మెంట్ తో పని చేస్తున్న నరేంద్ర ని కక్ష పూరితంగా అరెస్ట్ చేశారు.సాక్షి పత్రిక గతంలో నాకు వ్యతిరేకంగా ఎన్నో ఆర్టికల్స్ రాసింది నేను ఇదే చేసి ఉంటే నువ్వు సీఎం అయ్యేవాడివేనా?నరేంద్ర భార్య గవర్నర్, చీప్ జస్టీస్ కి లెటర్స్ రావడం జరిగింది.ఇన్ని జరిగిన తరువాత కూడా ఆయనను టార్చర్ చేశారు.అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్దాయి అధికారులు ఆయన మీద దాడి చేశారు.

గతంలో పోలీసులు ప్రజలకు రక్షణ కలిగించే వ్యవస్థ లాగా ఉండేది.కానీ ప్రస్తుతం పోలీసులు అంటే కక్ష తీర్చుకునే వ్యవస్థ లాగా తయారయ్యింది.పోలీసుల తీరుపై ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోవడం ఖాయం. రాష్ట్రంలో పనికిరాని వ్యవస్థ గా పోలీసులు, సీఐడీ మారాయి.రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నా..‍?పోలీసులు బరితెగించి చేస్తున్నారు… వారిని ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెడతా. విమానాశ్రయం లో దొంగ బంగారం విషయం సోషల్ మీడియా వచ్చిన దానిని అందరూ షేర్ చేశారు.షేర్ చేసిన అందరిని అరెస్ట్ చేస్తారా…? ఇలాంటి నీచమైన వ్యవస్థను భూస్థాపితం చేయవలసిన అవసరం ఉంది.. అంకబాబు రిమాండ్ చేశాం అని చెప్పారు.. ఆ కేసులో సీబీఐ కి కోర్టులో అక్షింతలు పడ్డాయి. సీఐడీ ఆఫీస్ ని ప్రక్షాలన చేయాలి.. సీఐడీ డీజీని రీకాల్ చేయాలి.

Leave a Reply