గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం లోని వెల్లటూరు వేణుగోపాల స్వామి ఆలయంలో గుడి శిఖరం పై ఉన్న పంచలోహాలతో తయారు చేసిన కలశాన్ని చోరీ చేయటం జరిగిందని పూజారి చక్రపాణి కంఠంరాజు శివరామ యోగేశ్వరరావు అన్నారు . ఈ కలశం మూడు వందల సంవత్సరాల నాటిదని అన్నారు.
పూజారి మాట్లాడుతూ గతంలో ఈ ఆలయంలో ఎన్నడూ దొంగతనాలు జరగలేదని అన్నారు . వేణుగోపాల స్వామి ఆలయం శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో కట్టుబడి చేసివుంటారని అన్నారు . గ్రామస్తులంతా భయాందదోలనలో ఉన్నారు అని తెలిపారు .