– బండి సంజయ్ కుమార్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును కలిసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
గరికపాటి నరసింహారావు ప్రవచనాలు సమాజంలో స్పూర్తి. యువత సైతం గరికపాటి ప్రవచనాలతో స్పూర్తి పొందుతున్నారు. గరికపాటి రచనలు ‘‘సాగరఘోష, అవధానఘోష, వైకుంఠపాళి’’ వంటి పుస్తకాలతోపాటు 21 రోజుల్లో సాహస్ర అవధానం చేయడం వంటి ఎన్నో అంశాలు నేటి వారికి ముఖ్యంగా యువతకు ఎంతో స్పూర్తిదాయకం.
గరికపాటి నరిసంహారావు చేసిన సేవలకు పద్మశ్రీ అవార్డు రావడం నిజంగా సంతోషంగా ఉంది.గరికిపాటి నరసింహారావు ఆశీస్సులు తీసుకునేందుకే ఇక్కడికి వచ్చాను. గరికిపాటి నరసింహారావు లాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం.
గత ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని మాత్రమే పద్మ అవార్డులు వరిస్తున్నాయి.మొగిలయ్య, గరికిపాటి, పద్మజారెడ్డి వంటి వారికి పద్మ అవార్డులు రావడమే ఇందుకు నిదర్శనం.