Suryaa.co.in

Andhra Pradesh

నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ

– నిందితుల బెయిల్ రద్దు చేయాలి
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్న ఫోర్జరీ పత్రాల కేసులో ఆధారాలను నెల్లూరు కోర్టు నుండి ఎత్తుకుపోవడం దుర్మార్గం. మంత్రిగా కాకానికి శిక్ష పడుతుందనే సాక్ష్యాల దొంగతనం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నెల్లూరు కోర్టు లాకర్ ఉన్న సాక్ష్యాల దొంగతనం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని వమ్ము చేసేలా ఉంది. తక్షణమే నిందితుల బెయిల్ రద్దు చేయాలి. నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరపాలి. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

 

LEAVE A RESPONSE