Suryaa.co.in

Political News

నాడు నాన్న – నేడు కొడుకు

కొండలను కొల్లగొట్టిన ఘనులు
దుర్వినియోగం – కర్మ – దేవుడి పాచికలు

మీడియాలో వస్తున్న వార్తలను చూసి, 2006 డిసెంబురులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నోరు విప్పాడు. అవును మా కుటుంబానికి వెయ్యి ఎకరాలకు పైగా భూములు వున్నాయి. అందులో మా నాన్న తెలియక కొన్న అసైన్‌డ్ భూములు కూడా వున్నాయి అని.
వెంటనే వాటిలో కొంత పేదలకు పంచేస్తున్నా అని ఢిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్‌ని సాక్షిగా పిలిపించి, ఓ షామియానా టెంటు వేసి, ఒక తంతుగా చూపాడు.

ఉన్నట్లుండి 2007 లో గ్రామీణ విద్యార్థులకోసం ఒక ట్రిబుల్ ఐటీ పెట్టాలనే ఆలోచన పుట్టుకొచ్చేసింది, ఇడుపుల పాయలోనే పెట్టాలనే తీర్మానింపచేసేశాడు. పులివెందుల నుండి బైపాస్ రోడ్లు, పీకాక్ పార్కు, బయో పార్కు ఎన్నని సకల హంగులు ఏర్పాటయ్యింది. ప్రభుత్వ ధనంతో. అక్కడ ట్రిబుల్ ఐటీ అనే సాకు చూపి. కానీ దానికన్నా ముందు ఏమి జరిగింది అంటే..

అబ్బాయి & కోడలు కలిసి ఖజానా డబ్బుతో కట్టి చూపిన రిషికొండ ప్యాలస్ లెక్కన ఒకటి, ఇడుపులపాయ పైన ప్యాలస్ కట్టాలని తలపోసాడు, వైఎస్ రాజసేఖర్ రెడ్డి. కానీ శేషాచల అటవీ పరిధిలోకి వస్తుందని, పర్యావరణం క్రింద అక్కడ కుదరదని ఆలస్యంగా తెలుసుకొన్నాడు. అప్పటికీ ఆశ చావక, దానిని ఆ చట్ట పరిధి నుండి తొలగించడానికి తిరుమలలో ఎన్నికలు కూడా జరిపించాలని చూశాడు. కొందరు హిందూ భక్తులు హైకోర్టులో వేసిన కేసుతో.. తోక ముడవాల్చి వచ్చింది.

దాని కోసం ఏకంగా.. తుడా ఛైర్మన్ చెవిరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఉద్యోగుల ప్రవర్తనకు శిక్షణ ఇచ్చే శ్వేతా డైరెక్టర్ భూమన సుబ్రమణ్యం రెడ్డిని టిటిడి ఎక్స్ అఫిషియో బోర్డు సభ్యులుగా చేశాడు. మొత్తం బోర్డు సభ్యులలో తన మందిని ఎక్కువ ఉండేలా చూసుకొన్నాడు. ఈ గ్యాంగులోనే విజయసాయి రెడ్డి, కడప నుండి డిసిసి చేసిన రెడ్డి కూడా టిటిడి సభ్యులుగా నియమింపబడ్డారు. ఇదంతా 2006లోనే జరిగింది.

శేషాచల అటవీ చట్టానికి తూట్లు పొడవాలని కుట్రకు తెరలేపినప్పుడే.. శ్రీవారు తన పాచిక విసిరాడు. ఆదికేశువులు నాయుడు ఏర్పాటు చేసిన విమానం గరుడ పక్షిలా గాలిలో తిరిగి ఇడుపుల పాయ భూముల బండారాన్ని ఫోటోలతో బట్టబయలు చేసింది. ఆ భూకంపం.. అసెంబ్లీని కుదిపేసింది. అలా ఇడుపులలో కట్టాలనుకొన్న తన రాజకోటను కట్టలేకపోయాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

కానీ వూరుకొంటాడా రెడ్డి? ఆశ చావలేదు. హరితా రిసార్ట్ హోటెల్ ఒకటి కట్టడం మొదలెట్టాడు టూరిజం డిపార్టుమెంట్ డబ్బులతో. అందులో ఒక ఎత్తైన వాచ్ టవర్ కూడా కట్టించాడు, అక్కడి నుండి చూస్తే.. తన ఇడుపులపాయ ఎస్టేట్ అంతా కనిపించేలా.

మరో రెండు నెలల్లో.. దానిని ప్రారంభిస్తారు వైఎస్ రాజశేకర్ రెడ్డి అనంగా.. దేవుడు మరో పాచిక వేశాడు. అసెంబ్లీలో గొడవ మొదలైంది తిరుమల అక్రమాలు, అవినీతి మీద. పతాకస్థాయికి వెళ్లింది ఆవేశాలు. సహించలేని వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎదురుదాడికి ఉసిగొలిపాడు తన మంత్రుల్లో కొందరిని.

చివరికి సహనం నశించిన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, దేవుడుతో పెట్టుకొన్న వారు ఎవరూ బాగుపడలేడు. వెంకటేశ్వర స్వామి క్షమించడు అని స్నేహితుడు వైఎస్ రాజసేఖర్ రెడ్డికి చివరి హితవు పలికాడు అసెంబ్లీలో.

అదే వైఎస్ రాజసేఖర్ రెడ్డికి చిట్టచివరి సభ అవుతుంది అని ఎవరూ అనుకోలేదు. గంటల్లో చిత్తూరులో రచ్చబండ అని వెళ్లడం, ప్రమాదంలో దుర్మరణం చెందడం జరిగిపోయింది.
రిషికొండను గొరిగి, రహస్యంగా.. ఏకంగా కళ్లు జిగేల్మనే భారీ భవంతులు కట్టించాడు జగన్.

చిన్నాన్న ను చంపినా.. దేవుడికే తెలుసు, పతి దానికీ దేవుడు ఉన్నాడు అని నమ్మే జగన్ విషయంలో కూడా..
దేవుడు విసిరిన రెండు పాచికలలో ఒకట్లే పడ్డాయి. ఆ రిషికొండ ఇంటిలో కాపురం పెట్టకుండా ఆశలు కూలాయి.
బండారం బయటపడింది. కర్మ ఎవరినీ వదలదు. ఒకే ఇంటికి జరిగినా.. ఎవరూ అది మనకు కాదులే అనుకొంటారు. కానీ కర్మ అనేది నిజం. నమ్మినా నమ్మకపోయినా!

LEAVE A RESPONSE