– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ: నందిగామ నగర పంచాయతీలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రపోతున్నారా?ప్రైవేటు అక్రమ కట్టడాలని ఈరోజు హడావుడిగా కూల్చివేతలు మొదలుపెట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆనాడు ఎక్కడికి పోయారు?ఆనాడు సక్రమ కట్టడం అయితే ఈనాడు అది అక్రమ కట్టడం అవ్వడం వెనుక ఆంతర్యమేమిటో టౌన్ ప్లానింగ్ అధికారులు బహిరంగ వివరణ ఇవ్వాలి.
కట్టడాలకు అనుమతులను ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులకు మరియు కమీషనర్ కి ఆనాడు తెలియదా ఇది అక్రమ కట్టడమని?అనుమతులు ఇచ్చిననాడు అది అక్రమ కట్టడమైతే అధికారులు పర్యవేక్షణ చేసి ఆనాడే వాటిపై చర్యలు తీసుకోవాలి కదా?ఆనాడు అక్రమ కట్టడాలు జరుగుతుంటే అధికారులు నిద్రమత్తులో ఉన్నారా? ఇటువంటి నిరంకుశత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం..నందిగామ నగర పంచాయతీ టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు నందిగామ నగర పంచాయతీ కమిషనర్ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.