Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా వ్యతిరేక విధానాలను తప్పు పట్టడమే మైనార్టీ యువత చేసిన తప్పా?

– పోలీసులకు రాజ్యాంగం, ఐపీసీ సెక్షన్లు వర్తించవా
– ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ అమాయకులను వేధించడమే వారి పనా?

– టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా

జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు కొందరు పోలీసులు అమాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతున్నారని, ప్రశ్నిస్తున్నారని అమరావతికి చెందిన జానీ అనే మైనార్టీ విద్యార్ధితో పాటు మరో 8 మందిపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేశారు. డిసెంబర్ 20న కొంత మంది యువత చిన్నపాటి గొడవకు పాల్పడితే అలా చేయడం తప్పని జానీ సర్ధి చెప్పి గొడవను సద్దుమణిగించాడు. కాని పోలీసులు అదే రోజు అర్ధరాత్రి జానీతో పాటు మైనార్టీకి చెందిన సుభాని, బాజీ, గాలిబ్, ఖాజా, జాకిర్, గోపి, ఆదాంల ఇళ్లకు వెళ్లి దౌర్జన్యంగా పోలీస్ జీబ్ లో ఎక్కించుకొని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. మూడు రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టారు, వారికి భోజనాలు కూడా పెట్టలేదు. వాళ్ల ఫోన్ లు లాక్కున్నారు? పోలీసులు అరెస్ట్ చేస్తే 24 గంటల్లో జడ్జి ముందుకు హాజరు పర్చాలి. తుళ్లూరు పోలీసులకు ఇవ్వన్ని వర్తించవా?

తుళ్లూరు సీఐ మూడు రోజుల పాటు చిత్రహింసలు, వేధింపులకు గురి చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన వారని కూడా చూడకుండా ఇష్టానుసరంగా బూతులు తిట్టారు. బూటు కాలితో తన్నారు. పైపెచ్చు మిమ్మల్ని జడ్జి ముందు హాజరు పర్చినప్పుడు ఈ రోజే అరెస్ట్ చేశారని, కొట్టలేదని, తిట్టలేదని జడ్జికి చెప్పాలని అలా చెయ్యకపోతే మీ మీద గంజాయి కేసులు, రౌడీషీట్ కేసులు పెడతామని బెదిరించారు. పోలీసులు రౌడీ వ్యవస్థ కోసం పని చేస్తున్నారా? ఐపీసీ సెక్షన్లు లేవా? జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు కొందరు పోలీసులు చట్టవ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు.

కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నలకు పోలీసులు ఏ విధంగా కొట్టారో, ఏ విధమైన పదజాలం వాడారో, ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో జానీ పూసగుచ్చిన్నట్లు వివరించాడు. జానీ చెప్పిన సమాధానం విన్న జడ్జి అతనికి వైద్య పరీక్షలు చేయించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. జానీ ఒంటిపై పోలీసుల దెబ్బలు ఇన్నాయని డాక్టర్లు దృవీకరించారు. ఆ నివేదిక ప్రకారం పోలీసులు కోరిన రిమాండ్ ను జడ్జి కొట్టివేసి సీఐ, డీఎస్పీకి నోటీసులు జారీ చేశారు.

కొందరు పోలీసులు ఏమైనా వైసీపీ కార్యకర్తలా? వైసీపీ సానుభూతిపరులా? ఒక ముస్లీం తెలుగుదేశం పార్టీ వైపు పని చేయడం తప్పా? ముస్లీంలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా జానీ పాల్గొనడం తప్పా? దళితులకు, ముస్లీంలకు మధ్య పోలీసులు చిచ్చు పెడుతున్నారు. ముస్లీంలపై పోలీసుల ధౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. ఈ కేసులు పోలీసులు ఉపసంహరించుకోకపోతే తీవ్రస్థాయిలో ఉధ్యమిస్తాం.

బాధితుడు జానీ:- మేము చేసిన తప్పు ఏంటి? చంద్రబాబు నాయుడు, టీడీపీని అభిమానించడం నా తప్పైతే ఆ తప్పును మళ్లీ మళ్లీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కొంత మంది విద్యార్ధులు గొడవ పడితే దానిని సద్దుమణిగించేందుకు నేను ముందుకు వెళితే పోలీసులు నాకు సంబంధం లేని కేసుల్లో ఇరికించారు. సీఐ దుర్గాప్రసాద్ అనరాని మాటలు అన్నారు. బూటు కాళ్లతో, బెల్టుతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు.

నా చుట్టు 10 మంది పోలీసులను పెట్టి వేధింపులకు గురి చేశారు. నేను ఎక్కడ ఉన్నానో తెలియకుండా చేశారు. పోలీసులు అనే వారు అందరికి న్యాయం చేయాలి గాని ఒక పార్టీకి కట్టుబడి ఉండకూడదు. ఇలాంటి పోలీసుల వలన సమాజంలో గౌరవం పోతుంది. సీఐ దుర్గాప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నాను.

LEAVE A RESPONSE