ప్రతి సంక్షేమ పథకం లో కేంద్రం నుంచి 60%, 50% ,40% రేషియొలొ నవరత్నాలలో ప్రతి సంక్షేమానికి వస్తుంది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో సారాయి మరణాల మీద.. ప్రతిపక్షం లేకుండా చేసి మాట్లాడుతూ వారి ఎమ్మెల్యేల చేత, మంత్రుల చేత శభాష్ అనిపించుకున్నారు.
మాకు మా ప్రభుత్వానికి ఆదాయ వనరులు మద్యం వల్లనే అని ఘంటాపథంగా చెప్పారు.దీనిమీద ఏదోక పేరుతో ప్రజలలో అలజడి సృష్టించి మద్యాన్ని తాగకుండా, కొనకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని తద్వారా ఆదాయం తగ్గి పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వకుండా చేయడానికి చేస్తున్నారని మాట్లాడారు .ఇది ప్రతిపక్షాలు పేద ప్రజలకు చేసే ద్రోహం, మోసం అని అన్నారు .ప్రజలకు అర్థం కానిదేదంటే ప్రతి పథకం లో కేంద్రం వాటా ఉంది కదా ! మరి దానిని ప్రస్తావించరేమిటి అనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలను అనౌన్స్ చేసేటప్పుడు మద్యం ఆదాయం ఆరు వేల కోట్లు మాత్రమే. కానీ ఈ రోజున మద్యం ఆదాయం 20 వేల కోట్లకు చేరింది. అంటే నేను అధికారంలోకి వస్తే పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్టానని చెప్పిన మాట తూచా తప్పకుండా, తప్పు అని అని ఆయన మాటల్లోనే నిరూపించుకున్నారు చెప్పుకొన్నారు.
మద్యం బ్రాండ్ విషయానికొస్తే ఇవన్నీ నేను పెట్టినవి కాదు పోయిన ప్రభుత్వంలోనివని చెప్పారు .
ముఖ్యమంత్రి మేము సంక్షేమ పథకాలకు ఇచ్హే డబ్బులు మద్యం ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే అన్నారు . కాబట్టి సంక్షేమ పథకాలకు ఆ మద్యం బ్రాండ్ లకు లింకు కాబట్టి.. వాటికి అమ్మ ఒడి, నాన్న బుడ్డి, వైయస్సార్ చేయూత, జగన్ అన్న ఇంటి స్థలము, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జగనన్న ఆసరా, మహిళలకు చేయూత, 45 సంవత్సరాలకే పెన్షన్, నవరత్నం లాంటి పేర్లు పెట్టండి . పథకాల కోసమే కదా ! కొనే వాళ్ళు, తాగే వాళ్ళు ఈ పథకాలు నా కోసమే కదా ! కాబట్టి మనము ఇంకా ఎక్కువ తాగాలి అనే ఉద్దేశం తోటి ఎక్కువ తాగుతారు మీ డిస్టిలరీలకు ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు ఇంకా మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
కరణం భాస్కర్
బిజెపి,
7386128877 .