Suryaa.co.in

Political News

అప్పుడు ఎగబడి ఓటేశారుగా.. ఇప్పుడు సమ్మగా ఉందా బాసూ..

పట్టిసీమ కట్టిన వారికి కృష్ణా గుంటూరు రెండు జిల్లాల్లో కలిపి ఘనంగా నాలుగు సీట్లు అల్లా ఇచ్చారు.. నేడు పొలాలు ఎండబెట్టి నెర్రలు కొట్టిస్తున్న పాలకుడు పాలన యమా రంజుగా వుందా?

అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే, దాని పరిధిలో రెండు సీట్లు కూడా వైసీపీ నే గెలిపించారు..నేడు పిచ్చి మొక్కలు మొలిపించిన పాలకుడు పాలన తృప్తిగా వుందా?

మొబైల్ క్లస్టర్..అపోలో టైర్స్..IIT..IISAR.. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే ,చిత్తూరు జిల్లాలో ఒక్క సీట్. అదీ కుప్పం లో బాబు గారిని మాత్రం గెలిపించారు. నేటి దోపిడీ చూస్తే అమోఘంగా వుందా?

గొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా కార్ల కంపెనీ ఏర్పాటు చేసి..సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి..90 % సబ్సిడీ కి డ్రిప్ పరికరాలు ఇస్తే, అనంతపూర్ జిల్లాలో 2 సీట్లు మాత్రం గెలిపించారు. నేడు ఎండుతున్న పంటలకు బిందెలతో నీళ్ళు పోసుకుంటున్న అప్పుడు అయినా జరిగిన పొరపాటు రియలైజ్ అయ్యారా?

మెగా సోలార్ ప్లాంట్..సీడ్ పార్క్ ఏర్పాటు..జైరాజ్ స్టీల్..ఓర్వకల్లు airport..ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే, కర్నూలు జిల్లాలో ఒక్కటి అంటే ఒక్క సీటు కూడా గెలిపించ లేదు..నేటి పాలన బాగా తృప్తిగా వుందా? పట్టుబట్టి పులివెందులకు కూడా నీరు ఇస్తే , ఆ కడప జిల్లాలో కూడా ఒక్కటి అంటే ఒక్క సీటు కూడా గెలిపించాలని అనుకోలేదు.. మరి నేటి పాలన ఆమోదయోగ్యం గా వుందా?

వాస్తవంగా పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృధ్ధి జరక్కపోయినా.. పట్టుబట్టి 4 స్థానాలలో గెలిపించిన ప్రకాశం ఈసారి మరింత మెరుగైన సంఖ్య నమోదు అవ్వాలి. ఇక నెల్లూరు సరేసరి..శ్రీసిటీలో జరిగిన అభివృద్ధి. నెల్లూరు సిటీలో జరిగిన అభివృద్ధి కళ్ళ ముందే వున్నా, ఒక్క సీటు కూడా గెలిపించని వారికి నేటి పాలన ఎంత సవ్యంగా వుందో? ఇలాగే పశ్చిమ..తూర్పు గోదావరి జిల్లాలు.. విశాఖ..విజయనగరం..శ్రీకాకుళం..ఏ ఒక్క జిల్లా అతీతం కాదు.

ఇప్పటికైనా ఆనాటి ప్రభుత్వ పాలన.. నాడు అందుబాటులో వున్న నాయకత్వం..పాలనలో పారదర్శకత..అధికార వ్యవస్థలో జవాబు దారి తనం.. నేటి పాలనలో నిర్భందం..అవినీతి..కళ్ళ ముందే కనిపిస్తుంది..
పోల్చి చూడండి.. సరైన నిర్ణయం తీసుకోండి.. ఇది మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం.. రాష్ట్ర భవిష్యత్తు కి సంబంధించిన నిర్ణయం.. ఇప్పటికి జరిగిన నష్టం చాలు.. ఇంకో చారిత్రక తప్పు చేయవద్దు..

– రాజేష్ అప్పసాని

LEAVE A RESPONSE