Suryaa.co.in

Andhra Pradesh

అసెంబ్లీలో బుద్ధి, జ్ఞానం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు

– విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
స్పీకర్ కు 5-6మీటర్ల దూరంలో ఉండి నిరసన తెలుపుతున్నా అకారణంగా సస్పెండ్ చేశారు.మద్యంపై వచ్చే ఆదాయం మీదే సర్కార్ కు ప్రేమ ఎక్కువ.

వైసీపీ సభ్యులు సభలో భజన చేస్తున్నారు:పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
సభ అట్టెంషన్ డ్రా చేయడానికి సభలో విజిల్ వేసాము.విజిల్ వేయడంలో తప్పు లేదు. సభలో నాటుసారా ఆధారాలు మేం బయటపెడుతుంటే సీఎం ముఖం చాటేశారు. మా సభ్యుల్ని సస్పెండ్ చేశాకే సభను నడిపిస్తున్నారు.
ప్రతిపక్షo మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వని సభ చరిత్రకెక్కింది.మార్షల్స్ సాయంతో నడుస్తున్న సభ చూస్తే మాకే సిగ్గేస్తోంది.
ఎంతమంది ని సస్పెండ్ చేసినా, చిట్టచివరి సభ్యుడు కూడా కల్తీసారా పై పోరాడతారు.

ప్రజల కోసమే అన్నీ భరిస్తున్నాం
 టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
కల్తీసారా మరణాలపై ఆధారాలతో దొరికేసరికి ప్రభుత్వానికి నోట మాటరావట్లేదు. ఏపీలో గంజాయి పంట తరహాలోనే నాటుసారా తయారీ జరుగుతోంది.

LEAVE A RESPONSE