ప్రస్తుతం అమరావతి కేంద్రంగా కొనసాగుతున్న హైకోర్టును రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు తరలించే ప్రతిపాదన ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ ఎంపీలు సంధించిన ఓ ప్రశ్నకు సమాధానంగా నేడు లోక్ సభలో మంత్రి ఈ ప్రకటన చేశారు.
అయితే హైకోర్టు తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని రిజిజు తన ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టుతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాల్సి ఉందని ఆయన తెలిపారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఓ నిర్ణయానికి రావాల్సి ఉందన్న రిజిజు… ఆ తర్వాత ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని సూచించారు.