Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీపై రోజురోజుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

– మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పాలకులది అవకాశవాద రాజకీయ మని…. తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు విమర్శించారు.
మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు ఆయన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, నేడు చేసే పనులకు పొంతన లేదు అన్నారు.రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, అధికారం వస్తే చాలు అన్నది తప్ప, వైసీపీ పాలకులు అన్నీ అసత్యాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే పరిస్థితికి వచ్చారు అన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అందరం పోరాడం.ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి 25 మందికి 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అని ప్రగల్భాలు పలికారు అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు సంజీవని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఎన్నికల ముందు మాట్లాడిన వైసీపీ పాలకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతే మరిచిపోయి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అన్నారు.
ఇప్పుడు మాత్రం కేంద్రంలో బీజేపీ కి మెజార్టీ వచ్చింది అంటున్నారు. అప్పుడు మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా బీజేపీకి మెజారిటీ ఉన్న, బీజేపీతో అప్పట్లో పొత్తు ఉన్న కూడా మేము తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర హక్కులకోసం తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడం.
జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఎక్కువ ఎంపీ స్థానలను రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఇచ్చిన ఇప్పుడు వైసీపీ పాలకులు ఎందుకు ప్రత్యేక హోదా పై పోరాడటం లేదో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పాలకులు సమాధానం చెప్పాలి అని, మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణ రావు డిమాండ్ చేశారు.మాయమాటలు, మభ్యపెట్టే మాటలు, సన్నాయి నొక్కులతో పక్కదారి పట్టించే రాజకీయాలు చెయ్యద్దు అన్నారు.
మేము నిలదీస్తే కేసులు పెట్టి పక్కదారి పట్టించేలా చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించండి, మా తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రాజీనామా చేయించి పోరాడదాం, ఈ సవాల్ కు వైసీపీ సిద్ధమా? అన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు. రాష్ట్ర హక్కులు కాపాడటంలో వైసీపీ పాలకులు పూర్తిగా విఫలం అయ్యారు అన్నారు.
విశాఖపట్నం మీద ప్రేమ చూపించి రాజధాని తెస్తామని వైసీపీ పాలకులు చెబుతున్నారు, విశాఖకు వచ్చే రైల్వేజోన్ పోయింది, రైల్వే జోన్ వల్ల వస్తాయన్న ఉద్యోగాలు ఎటు పోయాయో వైసీపీ పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు.రైల్వే జోన్ తెస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను వైసీపీ పాలకులు మోసం చేశారు, విశాఖ వాసులు ఈ మోసాన్ని అర్థం చేసుకోవాలి అన్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనికోసం అన్ని ప్రాంతాల ప్రజలు పోరాడి సాధించుకున్నారు. వైసీపీ పాలకులు విశాఖ ఉక్కు పై ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో ప్రజలు గ్రహించాలి అన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఆరోపణలు చేసిన పోలవరం ప్రాజెక్టును, అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేస్తున్నారు అని మండిపడ్డారు.
వైసీపీ నాయకులుఎన్నికల ముందు మన రాష్ట్రం 13 జిల్లాల చిన్న రాష్ట్రం, చిచ్చు పెట్టడం ఇష్టం లేదని చెప్పి, అమరావతి రాజధాని నాశనం చేస్తూ, ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ఇదేనా వైసీపీ పాలకుల రాజకీయం? అని ప్రశ్నించారు మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ళ నారాయణరావు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పాలకులు చేసే అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనించాలి అని, మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు ప్రజలకు సూచించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను, మీడియా తో పాటు గా సోషల్ మీడియా ఎంతో దోహదపడుతుందని, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి, అబ్దుల్ రహీమ్ ను మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), తదితరులు సత్కరించి, అభినందించారు. సోషల్ మీడియా లో ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని అబ్దుల్ రహీమ్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రచార కార్యదర్శి, పి.వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, వి.రాఘవేంద్ర రావు, ఎర్రంశెట్టి నారాయణరావు, కే.శివ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE