-దళిత, మహిళా ప్రజా ప్రతినిధులకు అవమానం జరుగుతుంది…
-పవిత్రమైన శాసన సభలో కూడా నీచమైన రాజకీయాలకు తెర లేపుతున్నారు..
-మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణి నీ మాతో కలిసి పని చెయ్యమంటున్నo..
-బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్..
జగిత్యాల జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సంస్కారం లేదని, దళిత, మహిళా ప్రజా ప్రతినిధులకు అవమానం జరుగుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ..జగిత్యాల పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ఇంట్లో శుక్రవారం ఆమెను ఈటెల రాజేందర్ పరామర్శించారు.