Suryaa.co.in

Andhra Pradesh

ఇరుకురోడ్లపై మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు

-పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది
-నాకు సానుభూతి అవసరం లేదు
-పిల్లల్ని చదివించే బాధ్యత టీడీపీది
-కందుకూరు ఘటనలో చనిపోయిన కార్యకర్తల మృత దేహాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళి
బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ, ఆర్థిక సాయం

కందుకూరు ఘటన తీవ్రంగా కలచివేసింది. కందుకూరు ఘటన లో చనిపోయిన వారి కుటుంబానికి పార్టీ తరపున రూ.15 లక్షల సాయం. నాయకులు అందిస్తున్న సహాయంతో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షల చొప్పున సాయం. చనిపోయిన ఎనిమిది మందిలో ఆరుగురు బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారు.

ఘటనపై ప్రధాని మోడీ సంతాపం తెలిపి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి కూడాncb1 ధన్యవాదాలు ఈ ఘటన చాలా బాధాకరం. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వచ్చా. పిల్లల్ని చదివించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.వాళ్లను పైకి తీసుకొచ్చే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్టు తీసుకుంటుంది.

బాధిత కుటుంబ సభ్యులకు ఏ ఆధారమూ లేదన్న భయం లేకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. 40 ఏళ్లకు పైబడి రాజకీయాల్లో ఉన్నా. చైతన్య రథంతో దేశంలోనే ఎన్టీఆర్ మొదటి సారిగాncb రోడ్ షో ప్రారంభించారు. తర్వాత అద్వానీ రథయాత్ర వచ్చింది. నేను కూడా పాదయాత్ర, బస్సుయాత్ర, రోడ్ షో నిర్వహించాను. అన్ని రాజకీయ పార్టీ నేతలూ చేస్తున్నారు.ఏ నాయకులు వచ్చినా పోలీసులు శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.

కందుకూరు ఘటన ఒకర్ని నిందించడం కంటే పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. నాకు సానుభూతి అవసరం లేదు. ఇరుకురోడ్లపై మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కో ఊరికి 10 నుండి 30 సార్లు వచ్చా. సభలకు పెద్దఎత్తున ప్రజలు వస్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా విమర్శించే విధానం కరెక్ట్ కాదు.

కందుకూరులో హాస్పిటల్ జంక్షన్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ నిర్వహించాం. అక్కడ మీటింగ్ లు ఇప్పుడు కొత్తగా రాలేదు. అన్ని రాజకీయ పార్టీలు అక్కడే సభలు ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడికి వచ్చినncb2 జనాన్ని సమన్వయం చేయాలి. దీన్ని కూడా విమర్శ చేస్తే వాళ్ల విజ్ఞత, అహంకారానికే వదిలేస్తున్నా. ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మనమే జాగ్రత్త తీసుకోవాలి. అందరూ సంయమనం పాటించి మన కార్యక్రమాన్ని క్రమశిక్షణతో నిర్వహించుకుందాం.

LEAVE A RESPONSE