Suryaa.co.in

Telangana

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు

– ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనను తెలపాలి
– అధికారులపై దాడులు జరగటం దురదృష్టకరం
– ప్రజా సమస్యలను, సూచనలను అభిప్రాయాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రజల వద్దకు వస్తారు
– ప్రజల వద్దకు వచ్చే అధికారులపై దాడులకు దిగడం హేమమైన చర్య
– లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనలో రాజకీయ కుట్ర
– దాడి ఘటనలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు
– లగచర్ల ఘటనలో గాయపడిన కొడంగల్ ఏరియా అభివృద్ధి డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి ని పరామర్శించిన రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు

హైద‌రాబాద్ : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతులు, గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర జిల్లా అధికారులు, కొడంగల్ ఏరియా అభివృద్ధి డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి పై జరిగిన దాడి పై రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయిన వెంకట్ రెడ్డిని ఎల్బీనగర్ లోని తన నివాసంలో పరామర్శించారు.

మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను, సూచనలను గౌరవిస్తుందన్నారు. ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ దాడిలో సంబంధం లేని అమాయకులకు ఎలాంటి శిక్ష ఉండదని మంత్రికి వెల్లడించారు.

పది ఏళ్లలో గత ప్రభుత్వం చేసిన ఎన్నో తప్పిదాలపై నిరసనల ద్వారా న్యాయపరమైన అంశాల ద్వారా ప్రభుత్వం పై పోరాడమన్నారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ తో పాటు ఫార్మా క్లస్టర్ ఏర్పాటుపై జరిగిన భూసేకరణ పైన ప్రభుత్వం పై శాంతియుతంగా న్యాయపరంగా కొట్లాడి గెలిచామన్నారు.

కొండపోచమ్మ సాగర్ లోని వేముల ఘాటు వద్ద ఎనిమిది సంవత్సరాల పైన టెంట్ వేసుకొని నిరసనలు తెలపడం జరిగిందన్నారు. వచ్చిన అధికారులకు తమ సమస్యలను వివరించడం జరిగింది తప్ప అక్కడ ఒక్క చిన్న దాడి జరగలేదన్నారు.

దాడులు జరగటం రాజకీయ కుట్రలో భాగంగా కనిపిస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. అధికారులు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వచ్చిన వారిపై దాడి చేయటం అమానుషమైన ఘటనగా పేర్కొన్నారు. ఘటన ను ఖండించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రులు పరామర్శించారు. ఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ….సంఘటన దురదృష్టకరం. ఈ ఘటన వెనుక ఉన్న వారందరినీ ప్రభుత్వం గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. హింస మార్గం ద్వారా ఏది సాధ్యం కాదన్నారు. అధికారులు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం వారే అభిప్రాయాలు సూచనలను తెలుసుకునేందుకు గ్రామాలలో పర్యటిస్తారన్నారు.

ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలను సూచనలను తీసుకోవడానికి అక్కడికి వచ్చిన అధికారులపై దాడులు చేయటాన్ని రాజకీయ కోణం దాగి ఉందన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు న్యాయపరంగా చట్టపరంగా నిరసనల ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేసే తెలియజేస్తారన్నారు. కానీ ఈ ఘటన వెనుక రాజకీయ కోణం దాగి ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

మంత్రుల వెంట చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముద్దగొని రామ్మోహన్ గౌడ్,. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ మామ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE