Suryaa.co.in

Andhra Pradesh

పటిష్ఠ భద్రత ఉండాలి

-సమీపంలోకి అనధికార వ్యక్తులను రానివ్వొద్దు
-అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా
-శ్రీకాకుళంలో మూడంచెల భద్రత పరిశీలన

శ్రీకాకుళం: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు దగ్గర పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. శ్రీకాకుళం శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈవీఎంల స్ట్రాంగ్‌ రూమ్‌లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌, జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాధికలతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనధికార వ్యక్తులను ఈ ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు. ఎలక్షన్‌ కమిష న్‌ నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అనంతరం శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు, ఎనిమిది శాసన నియోజకవర్గాల కు సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఉన్న భద్రతా పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, తాళాలకు న్న సీళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు పరిశీలించారు. తనిఖీ అనంతరం సందర్శకుల రిజిస్టర్‌లో సంతకం చేశారు. మూడంచెలు గల కేంద్ర పోలీసు బలగాల గార్డును, జిల్లా ఆర్మ్డ్‌ పోలీసు గార్డు, సివిల్‌ పోలీసు బందోబస్తులను పరిశీలించారు. ఈవీఎం కంట్రోల్‌ రూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ తమీమా అన్సారియా, టెక్కలి రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో వెంకటేశ్వరరావు, ఆయా నియోజకవర్గాలకు సంబం ధించి రిటర్నింగ్‌ అధికారులు భరత్‌ నాయక్‌, సి.హెచ్‌.రంగయ్య, అప్పారావు, లక్ష్మణమూర్తి, సుదర్శన్‌ దొర, రామ్మోహనరావు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE