Suryaa.co.in

Telangana

ఆర్టీఐపై పారదర్శకత ఉండాలి

మాజీ కమిషనర్ జి.శంకర్ నాయక్
సమాచార హక్కు చట్టం పైన అవగాహన సదస్సు 

హనుమకొండ జిల్లాలోని అంబేద్కర్ భవన్లో సమాచార హక్కు చట్టం పైన అవగాహన సదస్సు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ఆర్టీఐ మాజీ సమాచార కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టం అమలుపై ప్రభుత్వానికి పారదర్శకత, అధికారులు జవాబు దారిగా ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో సమాచార హక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు. అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు.

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజు,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏటి అంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగేండ్ల వెంకటేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ ఫోరం అధ్యక్షులు నమిండ్ల హరీష్, కుమారస్వామి, వరంగల్ జిల్లా యూత్ ఫోరం అధ్యక్షులు సాదబోయిన రాజు, వీరేందర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, మల్లె పాక నాగరాజు, పవన్, ప్రవీణ్, పెండేల కార్తీక్, కిరణ్, బందెల యాదలక్ష్మి, గోపికారాణి, డాక్టర్ కీర్తి రెడ్డి, రజిత, లయన్స్ క్లబ్ పద్మజ, రాఖి, దేవిక తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE