Suryaa.co.in

Political News

పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే లా & ఆర్డరు ఇలా ఉంటుంది

– నేడు యుపీలో యోగి, నాడు గుజరాత్‌లో మోదీ, ఉమ్మడి ఏపీలో బాబు అందుకు ఉదాహరణ

నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 2వ తేదీ ముందుగా పొలీస్ అనుమతి తీసుకుని కొందరు హిందువులు రాజస్థాన్ కరౌలి నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న మెయిన్ బజార్ వద్దకు వచ్చేసరికి ఇళ్ల పై నుండి ఆ ర్యాలీ మీద రాళ్ళ దాడి జరగడంతో మత గొడవలు మొదలయ్యాయి. దుండగులు కొన్ని ఇళ్ళు షాప్ లు తగల పెట్టారు. దాంతో రాజస్థాన్ ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది.

ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ గొడవలు జరిగినట్లు చెపుతున్నారు. అంతే కాక కేరళకు చెందిన PFI అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే వివాదస్పద సంస్థ ఇటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంది అని ఈ రాలీకి రెండు రోజులు ముందే రాజస్థాన్ ప్రభుత్వానికి లెటర్ రాసింది.

అయినా రాజస్థాన్ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదు. గొడవలు జరిగిన తరువాత పోలీసులు మరియు మీడియా ఆ ప్రాంతాలను దర్శిస్తే ఇళ్ల డాబాల మీద రాళ్లు, ఇటుకలు నిల్వలు కనిపించాయి. గొడవలు జరగవచ్చు అని ఒక సంస్థకు తెలిసినప్పుడు ప్రభుత్వానికి తెలియక పోవడం ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేదా కావాలని అశ్రద్ధ వహించారా?

ఈ సంఘటన లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం ఒక సాధారణ 31 సం.ల పోలీస్ కానిస్టేబుల్త్రేశ్ శర్మ సాహస కార్యం. అక్కడ గొడవల్లో తగలబడుతున్న ఒక ఇంట్లో ముగ్గురు స్త్రీలు ఒక పసికందు చిక్కుకుపోయారు. మంటలు ఎక్కువగా ఉండటంతో వారు బయటకు రాలేకపోతున్నారు. అటువైపు వచ్చిన శర్మ వెంటనే మంటల్లోకి దూకి ఆ బిడ్డకు వేడి తగలకుండా దుప్పటి చుట్టి తాను మంటల్లోంచి బయటకు వస్తూ ఆ స్త్రీలను కూడా అనుసరించమని చెప్పి పసి పిల్ల ప్రాణం ఆ ముగ్గురు స్త్రీల ప్రాణాలు కాపాడాడు.

కాంగ్రెస్ కౌన్సిలర్ మట్లాబ్ అహమ్మద్ ఈ దాడుల వెనుక ఉన్నాడు అని పోలీసులు అంటున్నారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. FIR లో కూడా అతని పేరు నమోదు చేసినట్లు కధనం.
లా అండ్ ఆర్డర్ పాటించే విషయంలో ఈ ప్రభుత్వాలు ఒక వర్గానికి కొమ్ము కాయడం ఇటువంటి గొడవలకు ముఖ్య కారణం.

హైదరాబాద్ లో కూడా తీసుకోండి NTR టీడీపీ రాక ముందు హైదరాబాద్ లో తరచుగా మత గొడవలు జరిగేవి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ గొడవలు వల్లే ఆ మత గొడవలు అని సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి చెప్పారు. హిందూ సంస్థలు వల్లే గొడవలు అనుకుంటే ఇప్పుడూ జరగాలి కదా? అలాగే గుజరాత్ తీసుకోండి. 2001 వరకు అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాలలో తరుచుగా మత గొడవలు జరుగుతూ ఉండేవి. మోడీ వచ్చాక 20 సం.లుగా అక్కడ గొడవలు లేవు.

ఉత్తరప్రదేశ్ లో కూడా అంతే యోగి రాక ముందు గొడవలు ఎక్కువగా జరిగేవి. యోగి ఎప్పుడయితే పోలీసులకు ఫ్రీ హాండ్ ఇచ్చాడో అప్పటి నుండి గొడవలు లేవు. రాజస్థాన్ లో వసుంధర రాజే ఉన్నన్నాళ్ళు లా అండ్ ఆర్డర్ బాగుండేది. ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయింది.

మత, కుల వర్గాలకు రాజకీయ నాయకులు కొమ్ము కాయకుండా లా అండ్ ఆర్డర్ పూర్తిగా పోలీసులకు విడిచిపెడితే వారు చక్కగా పని చేయగలుగుతారు. ఎప్పుడూ కుల, మత గొడవలతో అట్టుడికే ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ గాడిలో పడడానికి ఇదే కారణం.

– చాడా శాస్త్రి

LEAVE A RESPONSE