Suryaa.co.in

Political News

ఇవేగా పాలి’ట్రిక్స్ ‘…!?

తన కంటే
తెలివైనోడు
అందలం ఎక్కితే
చూడలేని అహం..
అణగదొక్కాలనే చూస్తుంది అహరహం..
ఒకనాడు రెండే సీట్లున్న పార్టీని అధికారంలోకి
తెచ్చిన సింహం..
ఇప్పుడు అజ్ఞాతంలో
కాలం వెళ్లబుచ్చుతున్న
దుస్థితి..నిరంకుశ ప్రవాహం!

నిబద్ధతకు నిలువుటద్దం
క్రమశిక్షణకు మారుపేరు..
ఆయన రథయాత్ర..
పార్టీకి జైత్రయాత్ర…
రథమెక్కితే
జాతి బ్రహ్మరథం
పట్టిన నాయకుడు
విరధుడై ఇంట కూర్చున్నాడు
దూరమై అత్యున్నత పల్లకీ..
ఎవరి దగ్గరుందో అసలు కీ..?

మళ్లీ పడింది ఇంకో వికెట్టు..
తిరగేస్తే మరో అట్టు..
ఇదేమి కనికట్టు..
నచ్చకపోతే..నప్పకపోతే
పనిపట్టు..
అతగాడితో ఎప్పటికైనా
పెద్ద పదవికి
‘ముప్పు’ వరపు
అనుకుని అటాకు చెయ్యకుండా
ట్రాకు మార్చి..
మరో టేకు లేకుండా
రక్తి కట్టించి కథ..
కంచికి చేర్చిన తీరు…
ఇదే కదా నరేంద్రుని
విజయాల తేరు…
అమిత్..ఉత్సాహంతో
పక్కనే షా..
విర్రవీగుతూ సెహెన్ షా..!

ఉన్న పాత్రలు..
విశ్వాసపాత్రులను
పక్కదారి పట్టించి
కుట్రలు దట్టించి..
కొత్త పాత్రలు పుట్టించి
నాడు రామనాధుడు..
నేడు ద్రౌపది..
ఈ ఇద్దరికీ మోదం..
ఆ ఇద్దరికీ ఖేదం..
ఇదంతా ఎవరికి ఆమోదం..
ఇంకెవరికో వినోదం..!?

పాములు తిరిగే రాజకీయంలో
పావులు కదపడమే నాటకీయం

 

సురేష్ కుమార్ e

LEAVE A RESPONSE