-తెలంగాణకు కేసీఆర్ అవసరం లేదు
-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఏప్రెల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పేపర్ చూసిన ఏ టీవీ చూసిన అవీనితి వార్తలే కనిపించేవి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా సోనియా, రాహుల్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వ ధనం ఏ విధంగా దుర్వినియోగం అయిందో చూశాం.
మోదీది అవినీతి ప్రభుత్వం అని తొమ్మిదిన్నరేళ్లుగా ఎవరూ విమర్శించలేదు విమర్శించే సాహసం చేయలేదు ఎందుకంటే మోదీ అంత గొప్ప పాలనా అందిస్తున్నారు. ప్రజల డబ్బుకు ధర్మకర్తగా వ్యవహరించారు.
నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో ఉగ్రవాదుల దాడులు ఆగాయి. దేశంలో జాతీయ రహదారులను మోదీ విస్తరించారు. రామగుండంలో ఎరువుల పరిశ్రమను మోడి ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. కట్టెల పొయ్యితో తన తల్లిలా ఎవరూ ఇబ్బంది పడకూడదని మహిళలకు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. అయుష్మాన్ భారత్ పేదలకు రూ.5లక్షల ఆరోగ్య భీమా అందించారు.
తెలంగాణ అభివృద్దికి రూ.9లక్షల కోట్లు ఖర్చుపెట్టింది. మోదీ నేతృత్వంలో పదెళ్లుగా దేశం శాంతియుతంగా ఉంది. 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్‌లో అహింస తగ్గింది. ముస్లిం మహిళలకు సమస్యగా ఉన్న తలాక్ ను రద్దు చేశారు మోదీ. ఇచ్చిన మాట ప్రకారం మోదీ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించారు. అయోధ్యలో రామలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది.
ఏప్రెల్ జరిగే ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు. మన భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలు. దేశ భవిష్యత్ కోసం మీ పిల్లల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికలు. మోడిని ఆశీర్వదించండి. ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హూస్‌కు వెళ్ళిపోయింది. కేసీఆర్ పని అయిపోయింది. తెలంగాణ ఆయన అవసరం లేదు.. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎలా మోసం చేసిందో చూశాం. ప్రజా దనాన్ని, భూములను బీఆర్ఎస్ నాయకులు దోచారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు.. ఆ పార్టీ ఓటు వేస్తే మూసీలో వేసినట్టే.. గంప గుత్తగా బీజేపీ గెలవనుంది.