Suryaa.co.in

Andhra Pradesh

స్వచ్ఛభారత్ కి వారే వెన్నుముక

-పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి వారి సేవలను స్మరించుకున్నారు
-స్వచ్ఛభారత్ కి వారే వెన్నుముక
-పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్య కుమార్ యాదవ్
-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాటలో మంత్రి సత్యకుమార్ యాదవ్ 

స్వచ్ఛభారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన జె.ఆర్ సిల్క్స్ అధినేత జింక రామాంజనేయులు దుస్తులు మంత్రి గారికి అందజేయగా వాటిని NDA కార్యాలయంలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్ర కుమార్ యాదవ్ మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ కార్మికులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. “మీరు ప్రతిరోజు సమాజానికి అందించే సేవలు ఎంతో కీలకమైనవి. మీ సమర్థవంతమైన పనితీరు వల్లనే మన పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి” అని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల సంక్షేమం మరియు అభివృద్ధిపై మునుపటి కంటే మరింత దృష్టి పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి గారు గత 30 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో పని చేస్తూ అమూల్యమైన సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులు ఎస్. సాలమ్మ, ఎం పెద్ద నాగప్పల కాళ్లు కడిగారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు కేశవా, పార్థ, సంసన్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి చర్లపల్లి నారాయణస్వామి, జింక చంద్ర, గోట్లూరు చంద్ర సాకే ఓబులేష్, కోటి బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE