Suryaa.co.in

Andhra Pradesh

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం

  • వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ జేపీసీ ఛైర్మన్‌ జగదాంబికా పాల్‌కు వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వ్రాతపూర్వకంగా అందజేసిన జేపీసీ మెంబర్‌ వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌
  • వక్ఫ్‌ బిల్లుపై టీడీపీ డబుల్‌ గేమ్‌ ఆడుతోంది : హఫీజ్‌ ఖాన్‌

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హఫీజ్‌ ఖాన్‌ ఏమన్నారంటే… ఈ రోజు హైదరాబాద్‌లో వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు జేపీసీ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో ఈ వక్ఫ్‌ సవరణ బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో లిఖితపూర్వకంగా ఇచ్చాం, ఈ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకం, దీని వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని వారికి వివరించాం. వక్ఫ్‌ భూములకు సంబంధించి కలెక్టర్‌కు అథారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, వక్ఫ్‌ భూములకు సంబంధించి వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఉంది, ట్రిబ్యునల్‌ను బలహీనపరిచేలా ఈ బిల్లు ఉంది, ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది, ముస్లిం సమాజం అంతా దీనిని వ్యతిరేకిస్తుంది.

మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ చాలా స్పష్టంగా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పారు, దీనిపై లోక్‌సభలో మిథున్‌రెడ్డి , రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు ఈ వక్ఫ్‌ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో కూడా ఉభయసభల్లో చెప్పారు. ఈ రోజు జేపీసీ మెంబర్‌ విజయసాయిరెడ్డి వ్యతిరేకిస్తూ లిఖితపూర్వకంగా ఇచ్చారు, అయితే టీడీపీ మాత్రం పార్లమెంట్‌లో ద్వంద వైఖరి అవలంభిస్తుంది, ఈ ఇష్యూని గందరగోళంలో పడేస్తుంది, టీడీపీ ఇప్పుడు కూడా రెండు కళ్ళ ధోరణి అనుసరిస్తుంది, టీడీపీ పార్లమెంట్‌లోనే వ్యతిరేకించి ఉంటే జేపీసీ వరకు వచ్చేది కాదు, కానీ అక్కడ మద్దతిచ్చి ఇక్కడ ఇలా నాటకాలు ఆడుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు వివిధ ముస్లిం సంఘాలు వక్ఫ్‌ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా టీడీపీ మాత్రం డబుల్‌ గేమ్‌ ఆడుతూ ముస్లింలకు మరోసారి ద్రోహం చేస్తుంది, దీనిని ముస్లిం సమాజమంతా గమనించాలి.

LEAVE A RESPONSE