-యూపీ సీఎం యోగి వ్యంగ్య వ్యాఖ్యలు
-యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ANI కి ఇచ్చిన ఇంటర్వూలోని ముఖ్యాంశాలు
1. కాంగ్రెస్‌ని నాశనం చేయడానికి BJP అక్కర్లేదు. అన్నాచెల్లెళ్లు చాలు.
2. అజామ్ ఖాన్ జైలు నుండి బయటకు రావడం అఖిలేష్ యాదవ్‌కి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే అతను బయటకొస్తే అఖిలేష్ పప్పులుడకవ్
3. భారత్‌ను ఆక్రమించుకోవాలనుకునే వారి కల.. వారెదురు చూస్తున్న ప్రళయం ఒచ్చినా నెరవేరదు.
4. దేశపాలన రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. షరియాను అనుసరించి కాదు. మన వ్యక్తిగత, మతపరమైన నమ్మకాలను, విశ్వాసాలను అనుసరించి దేశంలోని వ్యవస్థలు సంస్థలు నడవలేవ్. రాష్ట్రంలోని ఉద్యోగులంతా కాషాయం ధరించాలని నేను చెప్పలేను. స్కూళ్లలో యూనిఫాం తప్పనిసరి.
5. ప్రపంచమంతా ఆరాధిస్తున్న విశ్వజన నాయకుడు మోదీ, దేశంలో అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు. ఎవరో కొందరిని బుజ్జగించడం కోసం కాదు.
6. ఇప్పుడు మేం పేదలకిస్తున్న రేషన్ అంతా.. ఇంతకుముందు ఎస్పీ బీఎస్పీ నేతలు వారి మాఫియా అనుచరులే బొక్కేవారు.
7. ఉత్తరప్రదేశ్.. బెంగాల్, కేరళ అవుతుందని రాష్ట్ర ప్రజలను హెచ్చరించడం నా బాధ్యత.
8. ఇంతకు ముందు రాజకీయాలు కులం, కుటుంబం చుట్టూ తిరిగేవి. ప్రధాని మోదీ దేశ రాజకీయాల అజెండాను అభివృద్ధి దిశగా మార్చివేశారు. BJP ఏదో ఒక కుటుంబం, కులం, మతం కోసం పనిచేయదు. మా అభివృద్ధి అజెండా జాతీయవాదంతో కూడుకొన్నది. పేదలు, రైతులు, యువత, గ్రామాలు, దేశం అభివృద్ధే మా ధ్యేయం.
9. యూపీ మొదటి దశ ఎన్నికలు అల్లర్లు అనేవి లేకుండా ప్రశాంతంగా జరిగాయి. బెంగాల్, కేరళల్లో ఎన్నికల సమయంలో జరిగిన ఆటవిక హింస, బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ చూశాం. ఆ రాష్ట్రాల్లో BJP నేతలు, కార్యకర్తలను హింసించారు, హత్య చేశారు. శాంతిభద్రతల్లో, యూపీకి ఆ రాష్ట్రాలకు ఉన్న తేడా అదే.
10. 80-20 వ్యాఖ్య మతపరమైనది కాదు. BJP చేసే మంచి పనులను సమర్థించేవారు 80% ఉంటే, అకారణంగా వ్యతిరేకించే వారు 20% ఉంటారు.. అని తెలియజేయడమే. ప్రతి “చర్య” కు “ప్రతిచర్య” ఉంటుంది. ఈ ఎన్నికల్లో అదే జరగబోతోంది. 80% ప్రజలు మా వెంటే ఉన్నారు. మొదటి దశ ఎన్నికల్లో అదే ఋజువైంది. మేం 300 పైగా స్థానాలు సాధిస్తాం. అధికారంలో కొస్తాం.
ఇట్లు
మీ పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు