Suryaa.co.in

Political News

మోడీ దెబ్బకు మాయమవుతున్న దొంగలు

మన గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోడిజీ ఈ మధ్య ఎందుకు చాలా మంది చేత విద్వేషాన్ని ఎదుర్కొంటున్నాడు?
చాలా వాస్తవాలను విశ్లేషించిన తరువాత ప్రతి అవినీతిపరులైన రాజకీయ నాయకులు, నల్లధనం బాధితులు, తీవ్రవాద గ్రూపులు, ఆటంకవాదులు, దేశద్రోహులు అందరి కడుపుమంటకి నిజమైన కారణం.. మన దేశభక్తుడైన ప్రధాని నరేంద్ర మోడిజీ యొక్క అవినీతి వ్యతిరేక విధానాల కారణంగానే అని అర్ధమైంది.
అది డి-మోనటైజేషన్ లేదా బ్యాంక్ ఖాతాలతో ఆధార్ జత చేయడం, లేదా టాక్సులు, సంపాదన, ఆదాయాలకు పాన్-కార్డుతో సహా ఆధార్ జత చేయడం
తద్వారా నల్లధనం నిర్మూలన, మాత్రమే వారి ద్వేషానికి కారణాలని కళ్ళకు కట్టినట్టు అర్ధమైంది….

ఒక కొత్త బేస్ (ఆధార్ నం) ని లింకప్ చేయడం ద్వారా, ఒక మిలియన్ మంది కటిక పేదలు మహారాష్ట్రలో అదృశ్యమయ్యారు
30 మిలియన్ల (30,000,000) నకిలీ LPG కనెక్షన్ ఖాతాదారులు మాయమయ్యారు .
మదరసాల నుండి ఉపకార వేతనాలు పొందుతున్న 1,95,000 నకిలీ బాల బాలికల జాబితా ఎడారి ఎండమావిలా అదృశ్యమైంది.
1.5 మిలియన్ల (1,500,000) నకిలీ రేషన్ కార్డుదారులు అదృశ్యమయ్యారు.

ఎందుకని ఈ తరహా నకిలీ మనుషులు, అకౌంట్స్ ఖాతాదారులు మాయమవ్వడం ఎలా మొదలైంది ?
ఈ బ్లాక్ మార్కెట్ దొంగల మొత్తం చిట్టా బయట పడబోతోంది.. కాబట్టి ఈ దొంగలందరూ కలిసి గౌరవనీయమైన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన దావా ప్రాథమిక ఆదాయ నివేదికలకు ఆధార్, పాన్ కార్డుల జతచేయడం అనేది మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని వాజ్యం వేశారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా ఈ చిట్టాలో ఉండడం మన ప్రజాస్వామ్యానికి అత్యంత హేయకరం.

మోడీ ఏం చేశాడు ?
1) 3 లక్షల పేపర్ నకిలీ కంపెనీలను మూసివేయబడ్డాయి.
2) రేషన్ డీలర్లు దొంగ లిస్టులు కోల్పోవడంతో చాలా కోపంగా ఉన్నారు.
3) అక్రమ ఆస్తుల, బినామీ కింగ్ లు, బ్రోకరేజ్ డీలర్లు అందరూ తీవ్ర అసహనంతో ఉన్నారు
4) అక్రమాలకు అలవాటు పడ్డ బ్రోకర్లు Online సాధన వ్యవస్థతో తమ గుట్టులు రట్టవుతాయని బెంబేలుపడ్డారు.
5) 40,000 నకిలీ NGO లను మూసివేశారు, కాబట్టి ఈ NGO ల యజమానులు శరాఘాత హతాశులయ్యారు
6) బినామీ నంబర్ టూలనుండి ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తులు హతాశులయ్యారు.
7) ఇ-టెండర్ ప్రక్రియ ద్వారా, చాలామంది కాంట్రాక్టర్ల పప్పులు ఉడకడం మానివేశాయి.
8) గ్యాస్ కంపెనీల ఆధారం చేయడం వాళ్ళ కొందరి ఆగ్రహం!
9) ఇప్పటి వరకు, ఎప్పుడూ టాక్స్ అనేదే కట్టి ఎరుగని, కొత్తగా ఆదాయం పన్ను స్కాన్ కింద వచ్చి జేరిన 12 మిలియన్ల ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభం అయ్యింది.
10) GST వ్యవస్థ పరిచయంతో, వ్యాపార ప్రజలు ఏం చేయాలో పాలుపోక వ్యతిరేకత మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రజలందరూ ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థకు వచ్చారు!
11) నంబర్ టూ వ్యక్తుల ఆటలు సాగక, ఏం చేయాలో పాలుబోక అసహనులయ్యారు.
13) దాచిన నల్లధనాన్ని తెల్లబరచడం కాస్త బాగానే పెళుసుగా మారి గట్టి దెబ్బ తీసింది.
14) సోమరిపోతు ప్రభుత్వ అధికారులు సమయానికి రావడం, పోవడం నిష్ఠగా పనిచేయడం అన్నది ఎరుగక అతలాకుతలం అయ్యారు.
15) సమయానికి పని చేయడమనే అలవాటు లేక, లంచాలను తీసుకోవడం మరిగిన ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు జరుగుతోంది అర్ధం కాక నోరెళ్లబెట్టారు.
16) నకిలీ కరెన్సీ డీలర్స్: – డిజిటల్ ఎకానమీ కారణంగా వారిపై ఒత్తిడి పెరిగి కకావికలమయ్యారు.
17) తీవ్రవాద, ఉగ్రవాద, ముసుగు సంస్థలు: – వారి నిధుల సమీకరణ అనేది కరువై అత్యంత దయనీయంగా తయారైంది.
18) రియల్ ఎస్టేట్ మాఫియా: – వారి చెల్లింపులల్లో, లావాదేవీల్లో చాలా పెద్ద భాగం నగదు రూపంలో ఉంటుందనీ, CASH FLOW కారణంగా అకౌంట్ జమ చేయలేని నగదు, నల్లధనం వివరాలు బయటకి కక్కలేక కకావికలం అయ్యారు. ఇప్పుడు అవి లెక్కించని నగదుకు, నల్లధనం ఎం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
19) రాజకీయ నాయకులు: – దాదాపుగా జీరో స్కాములు అని నిరూపించబడిన నరేంద్ర మోడిజీ కూడా తన పూర్వ ప్రధాన మంత్రుల వలె ఉండి, కళ్ళు, చెవులు మూసుకు పోవచ్చని, ఆశ పడ్డ రాజకీయ నాయకులు, బ్రోకరేజ్ వ్యక్తులు, సంస్థలు మోడీ గారి తీరుకి తీవ్ర అసంతృప్తికి మనస్తాపానికి గురయ్యారు.

ఇలా మోడీ వ్యతిరేకులు అందరూ కట్ట కట్టుకుని మోడీ వ్యతిరేకంగా కలిసిపోయి, ఒక కూటమిగా ఏర్పడి కూటు ఖిచిడి పార్టీని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపారు. నరేంద్ర మోడిజీ రెండోసారి గద్దె ఎక్కకుండా ఉండాలని వెతకని దారి లేదు, లేపని రాయి లేదు.
అందువల్ల ఈ బాధ్యత ఇప్పుడు 1.25 బిలియన్ల మంది భారతీయులపై ఆధారపడి ఉంది.
అవినీతిపరులైన ఖిచిడి పార్టీలకు మద్దతు ఇవ్వాలో…… లేదా
ఈ భరతమాత యొక్క నిజమైన కుమారుడు, ,భారతపుత్రుడు మన గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోడిజీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని నిర్ణయించడం అనేది మన చేతుల్లోనే ఉంది.
ఇప్పుడుబాల్ మీ కోర్టులో ఉంది. చేయాల్సింది మనమే.

– రఘునాధరావుపాటిల్

LEAVE A RESPONSE