Suryaa.co.in

Features

క్రొత్త శకాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని పాలించేది ఈ హిమాలయ దేశమే!

శాస్త్ర సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా చివరికి ఆ పరిజ్జానం పై ఆధ్యాత్మికత విజయం సాధిస్తుందని హిందూ పురాణాలతో పాటు ప్రపంచంలోని అనేక మత గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అటువంటి కోవకు చెందిన శంభల. శంభల అన్నది ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరం ఉనికిని గుర్తించడానికి అనేక వేల పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు ఈ శంభల దేశం అంటే ఏమిటి, అక్కడకు చేరుకోవడం ఎలా తదితర వివరాలన్నీ:
హిమాలయాల్లోని శంభల దేశం
కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న హిమాలయాల్లో మానవుడు చేరుకోలేని ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా అక్కడకు కాలు మోపడం సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా అటు వంటి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయన్న విషయం కూడా తెలుసుకో లేకపోతున్నాడు. దీంతో మానవ మేధస్సుకు అందని ఎన్నో విషయాలు ఈ విశ్వంలో దాగున్నాయన్న విషయం మనకు స్పష్టమవుతుంది. అటువంటి విషయాల్లో శంభల కూడా ఒకటి. హిమాలయాల్లోని ఒక రాజ్యం పేరే శంభల. హిందూ పురాణాల్లోనే కాకుండా బౌద్ధ గ్రంధాల్లో కూడా ఈ శంభల రాజ్యానికి సంబంధించి వివరంగా రాసారు.
దాని ప్రకారం ఇక్కడ నివసించేవారు నిత్యం సుఖ సంతోషాలతో ఉంటారు. ఆయురారోగ్యాలతో సాధారణ మానవుల కంటే ఎక్కువ ఏళ్లు బతక గలుగుతారు. వీరికి సంపద పై ఆశ ఉండదు.
అంటే వీరి అయ:ప్రమాణం సాధారణ ప్రజల కంటే దాదాపు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ద`డంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈ దేశం కనిపించదు. అతి పవిత్రమైన ఈ దేశం కేవలం ధార్మిక విలువలు ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది. అటువంటి ధార్మిక ఆలోచనలు ఉన్నవారికి మాత్రమే ఈ పవిత్ర దేశంలోకి ప్రవేశం కూడా.
హిందూ, బౌద్ధ పురాణాలను అనుసరించి ఈ నగరం వయస్సు దాదాపు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడ ప్రజలు సుమారు 12 నుంచి 14 అడుగుల పొడవైన ఆజానుబాహువులు. మిక్కిలి బలవంతులు, శాంతి స్వభావులు. అయితే అన్యాయం జరిగితే మాత్రం ఊరికే ఉండరు. హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడిన వ్యవహారం.
అంతటి చల్లని, మంచుతో కప్పబడిన హిమాలయల్లో ఈ శంభల రాజ్యానికి చేరుకోవడంలో మొదట మనకు ఎడారి ఎదురవు తుంది. ఆ ఎడారి మార్గం చాలా కఠినంతో కూడుకున్నది.
ఇదిలా ఉండగా ఈ నగరానికి సంబంధించి ఇతర దేశాల వారు ఎన్నో పరిశోధనలు చేశారు. అందులో ముఖ్యమైనది రష్యా దేశీయులు క్రీస్తుశకం 1920లో జరిపిన పరిశోధనలు. అయితే ఈ పరిశోధనల్లో ఆ దేశానికి చెందిన కొంతమంది మిలటరీ, ఆధ్యాత్మిక వేత్తలు శంభల దేశానికి చేరుకోకపోయినా ఇందుకు సంబంధించిన స్పష్టత మాత్రం కొంతమంది యోగుల నుంచి తెలుసుకొన్నారు. దీంతో తాము ఆ ప్రాంతానికి ఇప్పట్లో చేరుకోలేమని తెలుసుకొని వెనుతిరిగారు. ఇందుకు సంబంధించిన లిఖిత పూర్వతక ఆధారాలు నియంత అడాల్ఫ్ హిట్లర్ కు దొరికాయి. దీంతో అతను తిరిగి క్రీస్తుశకం 1930లో ఈ శంభల దేశం ఎక్కడ ఉంది? ఎలా చేరకోవాలి.? అనే విషయాలను తెలుసుకోవాల్సిందిగా తనకు నమ్మకమైన కొంతమందిని పురమాయించాడు.
అయితే వారు కూడా ఎన్నోప్రయాసలకు ఓర్చుకొని ఈ శంభల దేశం దరిదాపుల్లో తపస్సులో కుర్చొన్న కొంత మంది యోగులను మాత్రం వెనుతిరిగారు. వారితో అతికష్టం పై కొద్ది సేపు సంభాషించగలిగారు. అటు పై ఈ బ`ందానికి నాయకత్వం వహించిన వ్యక్తి హిట్లర్ నుకలుసుకొని అక్కడికి చేరుకోవడం అసాధ్యమని చెప్పినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే అది భూలోకం పై ఉన్న స్వర్గమని చెప్పారు.
ఇదిలా ఉండగా బౌద్ధ గ్రాంధాల్లోని వివరాలను అనుసరించి ప్రస్తుత భూ మండలం పై పాపం పెరిగిపోయి అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో ఈ శంభల దేశంలోని పుణ్యపురుషులు విశ్వపాలనను తమ చేతుల్లోకి తీసుకొంటారు.
అప్పటి నుంచి భారత దేశంలో కొత్త శకం ప్రారంభమవుతుంది. ఆ శకం ప్రస్తుత కాలమాన ప్రకారం క్రీస్తు శకం 2424. ఈ విషయాలన్నీ కాలచక్రలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన మరికొన్ని రహస్యాలు బయటికి రావడం లేదు.
ఇక హిందూ పురాణాలు కూడా ఈ శంభల దేశంలోనే కల్కీ భగవానుడు ఉద్భవిస్తాడని చెబుతోంది. అటు పై ఈ విశ్వం పై దండెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేపడుతారని అనేక పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ శంభల దేశానికి సంబంధించిన ఒక విషయం ప్రచారంలో ఉంది. దీనిని అనుసరించి ఫ్రాన్స్ కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ తన 56 ఏళ్ల వయస్సులో టిబెట్ వచ్చారు. అక్కడ కొంతమంది బౌద్ధ సన్యాసులను కలుసుకొన్నారు. వారి ద్వారా శంభల వెళ్లి అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాలు తీసుకున్నరని చెబుతారు. అందువల్లే ఆమె 101 ఏళ్లు పూర్తి ఆరోగ్యంతో బతికారని చెబుతారు.
ఒక్క రష్యానే కాకుండా అనేక దేశాల వారు ఈ శంబల దేశం కోసం అనేక పరిశోధనలు చేశారు. ఇంకా చేస్తున్నారు. అయితే వారు ఈ శంభల దేశాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్. దిఫర్బిడెన్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్, హిడన్ సిటీ తదితర పేర్లతో పిలుస్తున్నారు.

LEAVE A RESPONSE