– పేదలకు పెద్దపీట వేశాం
– రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ప్రజారంజక బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కి ప్రభుత్వానికి ధన్యవాదాలు.బడ్జెట్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించింది. తమ ప్రభుత్వంలో విద్యా, వైద్యం , పరిశ్రమల ప్రోత్సాహానికి,మహిళా ఆర్థిక వృద్ధి ,సంక్షేమానికి పెద్ద పీట వేశాం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలను పెంచడానికి ఇటీవల ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రత్యేక నిధులు.బీసీ సంక్షేమం,ఆర్టీసీకి అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి ధన్యవాదాలు.రైతు భరోసా ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,సన్న వడ్లకు బోనస్ కి నిధులు కేటాయించి తమది రైతు ప్రభుత్వం గా మరోసారి నిరూపించుకుంది.
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయింపు. అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించడానికి ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి భారీగా నిధులు కేటాయించింది. అధునాతన సాంకేతిక శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్యాలను పెంపొందించడం. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డా,, బి ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లను ఏర్పాటు చేయడం శుభపరిణామం.
గిరిజనాభివృద్ధి కోసం రాష్ట్రంలో మొదటిసారిగా ఇందిరా గిరి జల వికాసం ప్రత్యేక పథకం ప్రారంభించడం అభినందనీయం. MSME ల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించడం వల్ల పారిశ్రామికంగ మరింత అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో మొదటి సారి నూతన టూరిజం పాలసి అమలులోకి తేవడం వల్ల రాష్ట్రంలో మరింత పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.
సినిమా రంగాల వారికి గద్దర్ అవార్డులు ప్రకటించడం గద్దర్ అన్న నీ గౌరవించుకోవడమే. రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో ఏకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటన. రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ పై ప్రత్యేక ఫోకస్ చేసి మౌలిక సదుపాయాల అభివృద్ధి. హోంగార్డులకు రోజు వేతనాలను పెంచి వారికి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మిత్ర యాప్ ద్వారా డ్రగ్స్ రహిత తెలంగాణ ను నిర్మించడం అభినందనీయం.